ETV Bharat / snippets

సచివాలయంలో రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - విధివిధానాలపై చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 9:23 PM IST

Cabinet Sub Committee Chairman Bhatti Vikramarka
Cabinet Sub Committee On Rythu Bharosa (ETV Bharat)

Cabinet Sub Committee On Rythu Bharosa : రైతుభరోసాపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఈనెల 11 నుంచి 16 వరకు జిల్లాలకు వెళ్లి రైతులు, నిపుణులను కలవనున్నారు. రైతుభరోసాపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ ఛైర్మన్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతుభరోసా విధివిధానాలు, అర్హతలకు ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది.

కౌలు రైతులకు రైతుభరోసా ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా రైతు సంఘాలు, నిపుణులతో చర్చించనున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే మంత్రులు వారం పాటు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16న మరోసారి సమావేశమై విధివిధానాలు ఖరారు చేసిన అసెంబ్లీలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.