ETV Bharat / snippets

వాళ్ల గురించి రోహిత్ అప్పుడే చెప్పాడు- ప్రొఫెషనల్ కెప్టెన్ అనిపించుకున్నాడుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 3:44 PM IST

Rohit World Cup
Rohit World Cup (Source: Associated Press)

Rohit About Spinnners: 2024 టీ20 వరల్డ్​కప్​ సెమీస్​లో ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా విజయంలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు స్పిన్నర్లు చెరో 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అయితే ఈ వరల్డ్​కప్ జట్టు ప్రకటన తర్వాత టీమ్​లో 4 స్పిన్నర్లు ఉండడంపై అప్పట్లో పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతమంది స్పిన్నర్లు ఎందుకని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మేనేజ్​మెంట్​ను ప్రశ్నించారు. దీనికి రోహిత్ అప్పుడే ఆన్సర్ ఇచ్చాడు.

'నాకు కచ్చితంగా నలుగురు స్పిన్నర్లు కావాలి. దీనికి కారణాన్ని ఇప్పుడు చెప్పను. వరల్డ్​కప్​లో మీరే చూస్తారు' అని రోహిత్ అన్నాడు. అయితే టీమ్ఇండియా తాజా విజయాన్ని చూసిన తర్వాత రోహిత్ పక్కా ప్లాన్​తోనే స్పిన్నర్లను ఎంచుకున్నట్లు అర్థమైందని నెటిజన్లు కెప్టెన్​ను ప్రశంసిస్తున్నారు. 'ప్రొఫెషనల్ కెప్టెన్' అంటూ పొగడ్తతలతో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ టోర్నీలో కుల్దీప్ 10, అక్షర్ 8 వికెట్లు పడగొట్టి రాణిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.