ETV Bharat / snippets

మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్- ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 1:56 PM IST

Modi
Modi (ANI)

Modi Oath Ceremony 2024 : కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అతి త్వరలో కొలువుదీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తే తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేసినవారు అవుతారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాల నేతలు హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని ప్రమాణస్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు, బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 17వ లోక్​సభను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ముర్ము తీర్మానాన్ని ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.