ETV Bharat / snippets

ఆస్పత్రి నుంచి ఎల్​కే అడ్వాణీ డిశ్చార్జ్‌- వారంలో రెండోసారి

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 6:26 PM IST

LK Advani Discharged From Hospital
LK Advani Discharged From Hospital (ANI)

LK Advani Discharged From Hospital : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ ఆడ్వాణీ(96) గురువారం దిల్లీలోని ఆపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆడ్వాణీ కుమార్తె ప్రతిభా అడ్వాణీ ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. సీనియర్‌ న్యూరోలాజీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వినీత్‌ సూరి సమక్షంలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

అంతకుముందు, జూన్​ 26న ఎల్​కే ఆడ్వాణీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందించారు. అనంతరం ఒక రోజులోనే(జూన్​ 27న) ఆడ్వాణీ డిశ్చార్జ్‌ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.