ETV Bharat / snippets

రాజ్యసభా పక్షనేతగా నడ్డా? 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే కొత్త అధ్యక్షుడు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 9:21 PM IST

JP Nadda
JP Nadda (Getty Images)

కేంద్రమంత్రి జేపీ నడ్డా రాజ్యసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుండడం వల్ల ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లుగా సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్-జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డా జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.