అంబులెన్స్‌లో ఉన్నది పేషంట్ కాదు, గంజాయి- సినీఫక్కీలో తరలిస్తున్న సరకును పసిగట్టి పట్టుకున్న పోలీసులు - Transportation of GANJA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 10:39 PM IST
Transportation of Marijuana in Ambulance : గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా అచ్చం సినీ ఫక్కీ తరహాలో ఓ అంబులెన్స్‌లోనే గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన అల్లూరి జల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని మోతుగూడెంలో పోలీసు తనిఖిల్లో భాగంగా ఈ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని ఒడిస్సా నుంచి తీసుకువచ్చి మోతుగూడెం పరిసరాల్లో నిల్వ ఉంచుతున్నారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌లో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Ganja Transportation in Alluri district : పోలీసులు తనిఖీల్లో భాగంగా అనుమానంతో అంబులెన్స్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉండటం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అంబులెన్స్‌కు ఏపీ రిజిస్ట్రేషన్ బోర్డు అమర్చి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.