LIVE: తిరుమల బ్రహ్మోత్సవాలు - ముత్యపుపందిరి వాహనంపై శ్రీనివాసుడు - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2024, 7:13 PM IST
|Updated : Oct 6, 2024, 9:19 PM IST
TIRUMALA MUTHYAPU PANDIRI VAHANAM: గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనసేవ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వర నృత్య కళాశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాల ప్రదర్శనలు ఆహూతులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ముత్యపు వాహనసేవ జరగుతోంది. ముత్యపు పందిరి వాహన సేవను సుకుమార సేవగా కూడా పిలుస్తారు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెబుతూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతాడు. తన భక్తులందరూ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలే ప్రకాశించాలని ఆ శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తాడు. ఇదే ఈ వాహనం అంతరార్థం. ముత్యపు పందిరిపై మనోరంజకంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షించి పునీతులవుతారు. ముత్యపుపందిరి వాహనంపై కలియుగ నాధుడు విహరిస్తున్నాడు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Oct 6, 2024, 9:19 PM IST