కన్నుల పండువగా కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం - Narasimha swami Rathothsavam - NARASIMHA SWAMI RATHOTHSAVAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 12:23 PM IST
Sri Lakhsmi Narasimha swami Rathothsavam in satyasai District : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. 15 రోజులపాటు సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు ఉభయ దేవరులతో కూడి బ్రహ్మరథంపై విహరిస్తున్నారు. ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడిని బ్రహ్మరథంపై అధిష్టింప చేశారు. బ్రహ్మరథం (తేరు) వద్ద అర్చకులు ఆగమన శాస్త్రం ప్రకారం విశిష్ట పూజలు చేశారు.
ఉదయం 8గంటల 15 నిమిషాలకు తిరువీధుల ఉత్సవానికి రథం కదిలింది. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ నినాదాల మధ్య దేవదేవుడు బ్రహ్మరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష జన వాహనతో కదిరి పట్టణం కిక్కిరిసింది. స్వామివారి తేరును లాగేందుకు యువకులు పోటీపడ్డారు. వారిని ప్రోత్సహిస్తూ భక్తులు గోవింద నామస్మరణతో ఉత్సాహపరచారు. రథం వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.