బ్రేకులేస్తే ఆగని 108 వాహనం- తీగలాగితే ఆ జిల్లాలో ఒక్కదానికి కూడా ఫిట్​నెస్ సర్టిఫికేట్ లేదు - Police Seize Ambulance - POLICE SEIZE AMBULANCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 6:25 PM IST

Kanigiri Police Seize the Ambulance: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలానికి చెందిన ప్రభుత్వ అంబులెన్సు ఈనెల 9న ఓ వ్యక్తిని ఢీకొన్న కేసులో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పోలీసులు వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను డ్రైవర్​ను అడిగారు. సర్టిఫికేట్లు లేకపోవడంతో కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు. అంతేకాక ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న 40 అంబులెన్స్​ల్లో ఏ ఒక్క దానికి కూడా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో అంబులెన్స్​కు సంబంధించిన సర్టిఫికేట్లు చూపిస్తేనే వాహనం అప్పగిస్తామనటంతో చేసేదేమి లేక వాటిని సమకూర్చారు. పోలీసులు అంబులెన్సును ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు.

ఇటీవల అంబులెన్సు ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటనలో పోలీసులు దానిని స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న అంబులెన్సులను కొనుగోలు చేసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కానీ ఒక్కదానికి సరైన సర్టిఫికేట్సు లేవు. అంబులెన్స్​లు రోడ్లపై తిరుగేందుకు అవసరమైన ధ్రువపత్రాలను సమకూర్చకపోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.