ఆ ఆలయాల మూలవిరాట్టులు భద్రంగానే ఉన్నాయి: మంత్రి ఆనం - anam ramanarayana reddy Comments - ANAM RAMANARAYANA REDDY COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:49 AM IST
Anam Ramanarayana Reddy Comments: పులిచింతల ముంపు ప్రాంతంలోని ఆలయాల్లోని మూలవిరాట్టులు భద్రంగా ఉన్నాయని, వాటన్నింటికీ కొత్త దేవాలయాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కోళ్లూరు ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన, గత ప్రభుత్వం ముంపునకు గురైన ఆలయాలను పట్టించుకోలేదన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో దేవాలయాల నిర్మాణం చేపడతామన్నారు.
గత ప్రభుత్వంలో పులిచింతల ముంపు గ్రామాల దేవాలయాలు పునర్నిర్మాణానికి నోచుకోలేదని మండిపడ్డారు. ఓ ఐపీఎస్ అధికారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన సందర్బంగా అభినందిస్తున్నానని అన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠ సమయానికి మూలవిరాట్‌కి వెండి మకర తోరణం అందజేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నానన్నారు. అంతకుముందు సత్తెనపల్లిలో కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన 65మంది విద్యార్థినీ, విద్యార్థులకు 15 వేల రూపాయల విలువ చేసే చెక్‌లు అందజేశారు.