ఏఎన్‌యూలో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ - అదనపు బలగాలు పెంపు - Collector And SP Visit Strong Rooms - COLLECTOR AND SP VISIT STRONG ROOMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 10:15 PM IST
Collector And SP Visit Strong Rooms in ANU at Guntur: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిఘా వర్గం సమావేశం నిర్వహణపై ధూళిపాళ్ల నరేంద్ర ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ ఆఘమేఘాలపై విశ్వవిద్యాలయానికి చేరుకొని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌కు సమీపంలోని డైక్ మెన్ ఆడిటోరియంలో సీసీ ఫుటేజిని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి 200 మీటర్ల వరకు బారికేడ్లు పెట్టి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అన్ని తనిఖీ కేంద్రాలలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.
తనిఖీ కేంద్రాల వద్ద 24 గంటలు బందోబస్తును నెలకొల్పారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి అదనపు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా మరో 90 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. వీరికి తోడుగా పోలీసులు మరో 100 మంది విధుల్లో చేరారు. అయితే అంతకు ముందు దీనిపై దూళిపాళ్ల నరేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో సమావేశం పెట్టడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.