LIVE : వరంగల్​లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM Revanth Reddy Live

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 1:37 PM IST

Updated : Jun 29, 2024, 7:16 PM IST

thumbnail

CM Revanth Reddy Warangal Tour: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.  నగరంలో సీఎం పర్యటించే మార్గంలో అడగడుగునా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్ కు వచ్చి... గీసుకొండ మండలంలో మెగా టెక్స్ టైల్ పార్క్ ను సందర్శించారు. పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను  సందర్శించారు. అనంతరం 24 అంతస్తుల్లో నిర్మితమౌతున్నసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆసుపత్రి సందర్శన ముగించుకుని, హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మహిళాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రెండున్నర గంటల సేపు గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ, స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్షిస్తారు. హంటర్‌ రోడ్‌లో  నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Last Updated : Jun 29, 2024, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.