'జగనన్న ఆడుదాం ఆంధ్ర'లో వైఎస్సార్సీపీ నాయకుడు హల్‌చల్ - అనంతపురం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 8:04 PM IST
Adudam Andhra In Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆడుదాం ఆంధ్రా పోటీల్లో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ హల్‌చల్ చేశారు. ఉరవకొండ ఎంపీడీఓ (MPDO), ఎంపీపీ (MPP), (PET) పీఈటీలతో వాగ్వాదానికి దిగారు. క్రికెట్ పోటీలలో కూడేరు జట్టుకు అన్యాయం జరిగేలా పోటీలు రూపొందించారని అగ్రహం వ్యక్తం చేశారు. కూడేరు మండలానికి అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ క్రికెట్ పోటీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతకీ సద్దుమనగకపోయేసరికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Adudam Andhra Under Police Security : కూడేరు క్రికెట్ టీం (Cricket Team) కు న్యాయం జరిగే వరకు పోటీలు ఎలా నిర్వహిస్తారో చూస్తానంటూ బెదిరింపులకు దిగడంతో ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురితో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసు భద్రత మధ్య జగనన్న ఆడుదాం ఆంధ్ర (Aadudam Andhra) క్రీడల పోటీలు నిర్వహించారు.