YSRCP Government Careless on Andhra Odisha Connectivity Road : అవి ఆంధ్ర - ఒడిశాను కలిపే కీలక ప్రయాణ మార్గాలు. సరిహద్దు ప్రాంతంలో తెలుగువారే ఎక్కువగా ఉండటంతో నిత్యం రాకపోకలు కొనసాగిస్తూనే ఉంటారు. అంతేకాదు వ్యాపార, వాణిజ్య కలాపాల కోసమూ వాటినే వినియోగిస్తారు. అంతటి ప్రాధాన్యమైన రహదారితోపాటు వంతెనను గత ఐదు సంవత్సరాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోక అధ్వానంగా మారాయి. గుంతలుగా మారి ఇనుప ఊచలు పైకి తేలుతూప్రయాణం ప్రాణసంకటంగా మారింది.
10 కిలోమీటర్లు గుంతలమయం : ఏపీ - ఒడిశాను కలిపే పాలకొండ - హడ్డుబంగి రహదారి. వివిధ పనుల నిమిత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉపాధి కోసం కూలీలు ఒడిశాకు వెళ్తుంటారు. ఎంతో ప్రధానమైన రోడ్డు మార్గాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోక దారుణంగా తయారైంది. దాదాపు 10 కిలోమీటర్ల రహదారి గుంతలమయమై ప్రయాణం నరకంగా మారింది. చీకటి పడితే గోతులు ఎక్కడున్నాయో కూడా కనపడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖైదీలకైనా ఇలాంటి శిక్ష ఉండదేమో! - ఆ రోడ్డుపై 10 కిలోమీటర్ల ప్రయాణం దారుణం
మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారిన రోడ్డు : రహదారులనే కాదు వంతెనను కూడా గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఆంధ్ర - ఒడిశాను కలిపేలా 1996లో టీడీపీ హయాంలో 10 కోట్లు వెచ్చించి నివగాం - మాతల గ్రామాల మధ్య వంశధార నదిపై వంతెన నిర్మాణం చేపట్టారు. వందేళ్ల వరకు ధృడంగా ఉండాల్సిన వంతెన ఐదేళ్లూ కనీస మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారింది. ఇనుప ఊచలు పైకి తేలి పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నా, వేరే దారి లేక ఈ వారధి మీదుగానే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రహదారిని బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవేమి రోడ్లు బాబోయ్ - అడుగుకో గుంత, గజానికో గొయ్యి - Damaged Roads in Srikakulam
"ఉదయం, సాయంత్రం మేము పాలకొండ - హడ్డుబంగి రోడ్డులో ప్రయాణం చేస్తుంటాం.రహదారి గుంతలమయం అయ్యింది. రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గోతులు నీటితో నిండిపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. దయచేసి ఈ రహదారిని మరమ్మతులు చేయాలని కోరుతున్నాం." - వాహనదారులు
ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works