Wife Killed Husband With Help of her Lover in Eluru District : సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. ఈ ఘటనల్లో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. అంతేగాక భర్త ఉరివేసుకొని మృతిచెందాడని కుటుంబసభ్యులను నమ్మించింది. చివరకి పోలీసులు రంగప్రవేశంతో అసలు దొంగలు బయటపడ్డారు.
క్షమించి వదిలేస్తే ప్రాణం తీసింది - ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య : ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసిన ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన జిల్లాలోని లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల ఒకటో తేదీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేములపల్లి గ్రామంలో ఆశీర్వాదం, సుమలత భార్యభర్తలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే సుమలత, నాగారాజు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరి బంధానికి భర్త ఆశ్వీర్వాదం అడ్డుగా ఉన్నాడని సుమలత భావించింది. ఎలాగైన ఆశీర్వాదాన్ని హతమార్చాలని ఇరువురూ నిశ్చయించుకున్నారు.
భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి పీక నులిమి చంపిన భార్య : పథకం ప్రకారం ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి సుమలత, ఆమె ప్రియుడుతో కలిసి భర్త ఆశీర్వాదానికి నిద్ర మాత్రలు ఇచ్చి పీక నులిమి హతమార్చారు. అనంతరం భర్త ఆశ్వీర్వాదం ఉరివేసుకొని మృతిచెందాడని సుమలత కుటుంబసభ్యులను నమ్మించింది. ఇది నిజమే అని నమ్మి కుటుంబసభ్యులు నాగరాజుకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే దహన సంస్కారాలకు ముందు నాగరాజుకు స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని చూసిన మృతుని తల్లిదండ్రులు అనుమానంతో కోడలు సుమలతను నిలదీశారు. ఇప్పటికే భర్త పోయిన దుఃఖంలో ఉన్నాను అంటూ అత్తమామలు, కుటుంబసభ్యులతో చెప్పి దొంగ ఏడుపుతో బోరున విలపించింది. ఇక చేసేదేమీలేక కుటుంబసభ్యులు మృతుడిని ఖననం చేశారు.
స్నేహితుడని ఆదరిస్తే అదునుచూసి ఉసురు తీశారు - తెరవెనుక ఆమె సహకారం!
మృతదేహన్ని వెలికి తీసి పోస్టుమార్టం : ఆశీర్వాదం మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు, బంధువులు కోడలు సుమలత మీద అనుమానంతో మరోసారి గట్టిగా నిలదీశారు. చివరికి ప్రియుడు నాగారాజుతో కలిసి భర్త ఆశీర్వాదాన్ని హత్య చేసినట్లు సుమలత ఒప్పుకుంది. దీంతో మృతుడి బంధువులు ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఈ నెల మూడో తేదీన ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు ఆశీర్వాదం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితురాలు సుమలతని అదుపులోకి తీసుకొని ఆమె ప్రియుడు నాగారాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్ - మరొకరి కోసం గాలింపు