ETV Bharat / state

వసంత పంచమి వేడుకలు, అమ్మవారి చెంత వేడుకగా అక్షరాభ్యాసాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 2:09 PM IST

Vasanta Panchami Poojalu In Andhra Pradesh : వసంత పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల దేవతామూర్తుల నిలయమైన గౌశాలలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదు సంవత్సరాల లోపు బాల బాలికలకు అక్షరభ్యాసం నిర్వహించారు. విశాఖ శారదాపీఠానికి భక్తులు పోటెత్తారు

vasanta_panchami_poojalu_in_andhra_pradesh

Vasanta Panchami Poojalu In Andhra Pradesh : వసంత పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మహామండపంలోని అమ్మవారి ఉత్సవమూర్తులను హంసవాహనంపై వీణ, జపమాల పట్టుకుని ఉన్నట్లుగా సరస్వతి దేవి రూపంలో అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ఉత్సవ మూర్తి వద్ద గణపతి పూజ, సరస్వతి పూజ, వేదపండితులచే సరస్వతి మంత్ర హవనము జరిపారు.

వసంత పంచమి రోజు ఈ పనులు చేస్తున్నారా? అమ్మవారి ఆగ్రహానికి గురైనట్లే!

అమ్మవారి దర్శనానికి వచ్చే విద్యార్ధులను ఉచితంగా క్యూలైన్లు ద్వారా ముఖమండప దర్శనం కల్పించారు. విద్యార్ధులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana), దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఇతర పాలకమండలి సభ్యులు అమ్మవారి ప్రసాదం, పెన్నులను (Pens) అందించారు. ఈనెల 18వ తేదీన మల్లేశ్వరస్వామి దేవస్థానం (Temple) పునఃప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఐదు రోజుల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వసంత పంచమి వేళ భక్తులతో సరస్వతి ఆలయాలు కిటకిట

Vasanta Panchami Celebrations in Karnool : వసంత పంచమి వేడుకలను కర్నూల్​లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సకల దేవతామూర్తుల నిలయమైన గోశాలలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదు సంవత్సరాల లోపు బాల బాలికలకు అక్షరభ్యాసం నిర్వహించారు. విద్య తోనే సర్వతోముఖాభివృద్ధి చెందవచ్చని అవోపా సభ్యులు గోశాల నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరికి సరస్వతి (Saraswati) కృపతో మంచి విద్య బుద్ధులు రావాలని వారు కోరారు.

సరస్వతీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

Visakha Vasanta Panchami Festival 2024 : వసంత పంచమి సందర్భంగా బుధవారం విశాఖ శారదాపీఠానికి భక్తులు పోటెత్తారు. వందలాది మంది బాల బాలికలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యార్ధులు పెద్దఎత్తున సరస్వతీ పూజల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు. 987 మంది బాల బాలికలకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించగా, సరస్వతీ పూజల్లో 840 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. పరీక్షల సమయం కావడంతో అమ్మవారి పాదాల చెంత పూజలందుకున్న పుస్తకాలు, (Books) పెన్నులను విద్యార్ధులకు అందించారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులకు విశాఖ (Visakha) శారదాపీఠం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

విశాఖ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు

సరస్వతీ ఆలయాల్లో వైభవంగా వసంత పంచమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.