Tulasi Reddy Comments on CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుపతిలో తన ఓటమిని ఒప్పుకోవడం అనేది హర్షణీయమని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రానికి ముందే జగన్ చేతులు పైకి ఎత్తేశారని తెలిపారు. వైయస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ కాదు, జగనే చీల్చాడని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, చిన్నాన్న వివేకానంద రెడ్డి, చెల్లెలు షర్మిల కూడా కాంగ్రెసే అని ఆయన గుర్తు చేశారు. జగన్ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని కొత్త పార్టీ పెట్టుకున్నాడని విమర్శించారు.
రాష్ట్రాన్ని వీలైనంత త్వరగా విడగొట్టమని వైసీపీ పార్టీ 2012 డిసెంబర్ 28న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని తులసి రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 90 శాతం అమలు చేశామని జగన్ గొప్పలు చెప్పడం పచ్చి అబద్ధం అని తులసి రెడ్డి అన్నారు. నవరత్నాలు, రైతు భరోసా, అందరికీ ఇల్లు, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్ తదితర పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని తులసి రెడ్డి అన్నారు.
ముక్కలుగా మారి మూల్గుతున్న మంగళగిరి వైఎస్సార్సీపీ - ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి
ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు పైకి ఎత్తేశారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందనటం పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డే తన కుటుంబాన్ని చీల్చుకున్నాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామనటం హాస్యాస్పదంగా ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. నవరత్నాల వంటి పథకాలే నకిలీ రత్నాలు అయిపోయాయి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. నేటి నుంచి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు కూడా బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీ సేవలను అందించటం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు దాదాపు విఫలమయ్యాయి. -తులసి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
వైఎస్సార్సీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
Sailajnath Tells Leaders to Join Congress Party: వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ముఖ్య నాయకుల్లో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని శైలజనాథ్ అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అధికార పార్టీలోని చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి ఈనెల 28న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు వివరించారు.. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున పాల్గొని షర్మిల సభను విజయవంతం చేయాలని శైలజనాథ్ కోరారు.
వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా