ETV Bharat / state

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా? ఇలా బుక్​ చేసుకోండి - TTD DARSHAN TICKETS November 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 6:17 PM IST

TTD November Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్​ న్యూస్​ మీకోసమే. నవంబర్​ నెలకు సంబంధించి వివిధ రకాల దర్శన టికెట్లను ఈ నెలలో విడతల వారీగా విడుదల చేయనున్నారు. నవంబర్​ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. టికెట్లను ఎక్కడ, ఎలా బుక్​ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD Darshan Tickets for November
TTD Darshan Tickets for November (ETV Bharat)

TTD Darshan Tickets for November 2024: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం టీటీడీ పలు ఆర్జిత సేవలను నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్​ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్​కు సంబంధించిన షెడ్యూల్​​ను టీటీడీ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ సేవా టికెట్లు: ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

వర్చువల్ సేవా టికెట్లు: ఆగస్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

అంగప్రదక్షిణం టోకెన్లు: నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా: శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అదే విధంగా ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా: తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే విధంగా ఆగస్టు 27న శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఆసక్తి కలిగిన భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

శ్రీవారి భక్తులకు శుభవార్త - స్వామివారి కానుకల వేలం - లిస్ట్​లో ఏమేం ఉన్నాయో తెలుసా? - TTD Auction Mobiles and Watches

శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ - TTD announced Brahmotsavam dates

శ్రీవారిని దగ్గరగా దర్శించుకునే అవకాశమివ్వండి - భక్తుడి ప్రశ్నకు టీటీడీ ఈవో ఏం చెప్పారంటే ! - TTD Dial your EO Program

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.