ETV Bharat / state

ముందు నేను డాక్టర్ను-తరువాతే రాజకీయవేత్తను! గర్భిణీ కోసం ప్రచారాన్ని పక్కన పెట్టిన టీడీపీ అభ్యర్థిపై ప్రశంసల జల్లు - TDP MLA candidate - TDP MLA CANDIDATE

Darshi TDP MLA candidate Dr Gottipati Lakshmi: ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్. గొట్టిపాటి లక్ష్మి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీకి ఆపరేషన్ చేయాల్సి రావడంతో, ఉన్న పళంగా తన ప్రచారాన్ని పక్కన పెట్టారు. ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో గర్భిణీకి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి సుఖ ప్రసవం చేయించారు. ముందుగా తాను వైద్యరాలిని ఆ తరువాతే రాజకీయ వేత్తగా అభివర్ణించుకున్న గొట్టిపాటిపై స్థానికంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Darshi TDP MLA candidate Dr Gottipati Lakshmi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 9:36 PM IST

Darshi TDP MLA candidate Dr Gottipati Lakshmi: ఆమె వృత్తి రిత్యా వైద్యురాలు, వైద్య వృత్తి ద్వారా సేవలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేయడానికి సిద్దమయ్యారు. ఆ పార్టీ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే ఎన్నికల సమరం మెుదలవడంతో ఇంటింట ప్రచారం ప్రారంభించారా డాక్డర్. ఈ నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉన్నా, తన వృత్తి ధర్మాన్ని మాత్రం వీడలేదు. ఓ నిండు గర్భిణీ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి, ఆసుపత్రికి వెళ్లి గర్భిణీకి ప్రసవం చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రచారంలో ఉన్నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు ఆ అభ్యర్థి, అత్యవసరంగా సీజరిన ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అందుబాటులో గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్న ఓ గర్భిణీ కి తామున్నామంటూ ముందుకొచ్చి మానవత్వం చాటి చెప్పారు ఆమె ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రాంతంలో ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో కురిచేడు మండలం, అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ అనే గర్భిణీకి అత్యవసర ఆపరేషన్ చేయవలిసి రావటంతో డాక్టర్.గొట్టిపాటి లక్ష్మీ గారిని పెషేంట్ బందువులు సంప్రదించారు.

వామ్మో ప్రెస్ మీట్ లా - యూట్యూబర్లతో బెంబేలెత్తుతున్న రాజకీయ నాయకులు.! - YouTube channels

ప్రసవం సమయం దగ్గరపడటంతో వెంకటరమణకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. అప్పటికే ఉమ్మనీరు పూర్తిగా కాళీ అయ్యింది. అత్యవసరంగా సీజేరియన్ చేస్తే గానీ ప్రసవం కాదు. ఇక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు గానీ, ఒంగోలు గానీ తీసుకు వెళ్ళాలని వైద్యులు సూచించారు. అంతా సమయం, ఆర్థికంగా లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలీని పరిస్థితిలో వెంకటరమణ కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడారు. ఈ విషయం తెలుసుకున్న డా. గొట్టిపాటి లక్ష్మి వెంటనే స్పందించి ఎన్నికల ప్రచారం లో ప్రచారానికి కొద్ది సేపు విరామం ఇచ్చారు. అనంతరం వెంకటరమణ ఉన్న ఆసుపత్రికి వెళ్ళారు. ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో వెంకటరమణకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి ప్రసవం చేయించారు. వెంకటరమణ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.

తమ కుటుంబం ఇప్పుడు ఆనందంగా ఉండటానికి డాక్టర్ గారే కారణమని వెంకటరమణ సభ్యులు తెలిపారు. తాము డాక్టర్ గారిని సంప్రదించి పరిస్థితిని వివరించినట్లు వెంకటరమణ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఆవేదన అర్థం చేసుకున్న డా. లక్ష్మి గారు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. డా. లక్ష్మి మానవత్వంతో వచ్చి, ఆపరేషన్‌ చేయడాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొనియాడారు.

దర్శి ఇన్​ఛార్జ్​, సిట్టింగ్​ ఎమ్మెల్యే మధ్య విభేదాలు - బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.