ETV Bharat / state

'ఒక్క ఛాన్స్​ అని వచ్చిన జగన్​ ఇక రాజకీయ జీవితం లేకుండా చేసుకున్నాడు' - టీడీపీ పల్లా శ్రీనివాసరావు

TDP Leader Palla Srinivas Fires On YSRCP Govt : నారా లోకేష్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించిన శంఖారావం కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.సీఎం జగన్మోహన్​ రెడ్డికి ప్రజలోకి రావడానికి జగన్​కు పరదాలు ఎందుకు అవసరమవుతున్నాయని ధ్వజమెత్తారు. అధికారం అండతో రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్నారు.

tdp_leader_palla_srinivas_fires_on_ysrcp_govt

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 5:46 PM IST

TDP Leader Palla Srinivas Fires On YSRCP Govt : నారా లోకేష్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించిన శంఖారావం కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ టీడీపీ (TDP) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుర్చీ మడతపెట్టి జగన్​ను ఇంటికి పంపేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలన సమయం స్వర్ణయుగమైతే, జగన్మోహన్ రెడ్డి పాలన కాలం రాతియుగం అని అభివర్ణించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈనాడు కార్యాలయం పై, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్​ పై దాడులు చేయడం దారుణమని ఆయన అన్నారు.

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: పల్లా శ్రీనివాసరావు

వివేకానంద రెడ్డి హత్య జరిగితే చంద్రబాబుపై ఘోరంగా 'సాక్షి'లో రాతలు రాశారని, వైఎస్సార్సీపీ (YSRCP) లాగా ఆనాడు తాము స్పందిస్తే, పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. చినబాబు చిరుతిండ్లకు కోట్లు ఖర్చు అని జగన్ మీడియాలో అసత్యాలు రాశారని, అప్పుడు కోర్టును ఆశ్రయించారు కానీ, దాడులకు దిగలేదని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జి మాట్లాడారు.

విశాఖ ఉక్కు కోసం.. పార్లమెంట్​లో ఎందుకు ప్రశ్నించట్లేదు?: తెదేపా నేత పల్లా

TDP Leader Palla Srinivas Comments On YSRCP Govt : శారదా పీఠానికి పలుమార్లు వచ్చే, జగన్మోహన్ రెడ్డి సింహాచల పుణ్యక్షేత్రాన్ని ఎందుకు దర్శించుకోరని ప్రశ్నించారు. విశాఖకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడల్లా తీవ్రమైన ఆంక్షలు ప్రజలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గుడివాడ అమర్నాథ్​కి రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీ అని గుర్తుచేస్తున్నా అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్​గా ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. లోకేష్ పై అమర్నాథ్​ చేసిన వ్యాఖ్యలను గండి బాబ్జి తీవ్రంగా ఖండించారు.

రేపే.. విశాఖకు చంద్రబాబు.. పల్లా శ్రీనివాస్​కు పరామర్శ

Palla Srinivas Visakha : సీఎం జగన్మోహన్​ రెడ్డికి ప్రజలోకి రావడానికి జగన్​కు పరదాలు ఎందుకు అవసరమవుతున్నాయని ధ్వజమెత్తారు. అధికారం అండతో రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్నారు. వారి దుర్మార్గపు పాలనకు విలేకరుల మీద వైఎస్సార్సీపీ దాడులు చెయ్యడమే నిదర్శనమన్నారు. అక్రమ ఆర్జనతో విధ్వంస పాలన చేస్తున్నారని ఆరోపించారు. రుషికొండను బోడి గుండి చేశారన్నారు. ఒక్క ఛాన్స్​ అని అధికారం చేజిక్కించుకున్న జగన్​ (Jagan) కుర్చీ మడతపెట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నాారన్నారు.

ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.