Social Media Inturi Ravikiran was Arrested in Krishna District : సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యా మంత్రి లోకేశ్‌లపై అత్యంత అసహ్యంగా సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతూ ఆనందించే విశాఖపట్నంకు చెందిన ఇంటూరి రవి కిరణ్‌ను కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ పోలీసులు సోమవారం (అక్టోబర్ 21న) అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి అతడికి బెయిలు మంజూరు చేశారు.
టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఆగస్టు 17న ఇంటూరి రవి కిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై తీవ్ర అసభ్య పదజాలంతో అసహ్యంగా కార్టూన్లు సృష్టించి ఎక్స్ వేదికగా రవికిరణ్ వికృత పోస్టులు పెట్టినట్టు నిర్మల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్‌లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్
వికృత పోస్టులతో నాయకుల ఫొటోలను అవమానకరంగా మార్ఫింగ్ చేసి శునకానందం పొందుతున్నాడని నిర్మల తన ఫిర్యాదులో తెలియజేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రవికిరణ్‌ను గుడివాడ వన్‌టౌన్ పోలీసులు విశాఖపట్నంలో ఆగస్టు 31న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే రోజు అతడికి 41 సీఆర్‌పీసీ (CrPC) నోటీసు ఇచ్చి పంపామని వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
లైసెన్స్‌డ్ గన్‌తోనే తిరగాలని ఆలోచిస్తున్నా: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీన మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌లు రవి కిరణ్‌ను పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు నిరసన వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సోమవారం ( అక్టోబర్ 21న) రవికిరణ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రూ.10 వేలు నగదు, ఇద్దరి పూచీకత్తులపై అతడికి న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు ఖరారు - ఇద్దరి పేర్లు ప్రకటించిన అధిష్ఠానం