School Bus Accident in Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి జాతీయ రహదారిపై స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది విద్యార్థులు గాయాలపాలవ్వగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 36 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కావలి సమీపంలో ఈరోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్ లో…
— Lokesh Nara (@naralokesh) July 2, 2024
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై స్కూల్ యాజమాన్యం డివైడర్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి చెందిన పాఠశాల కావడంతో డివైడర్‌ను ఏర్పాటు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి జాతీయ రహదారి డివైడర్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టిన కంటైనర్ - తండ్రీ కుమారుడు మృతి - Road Accident in NTR District
మరోవైపు ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, ప్రమాదంలో లారీ క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్లో ఉంచుకోవాలని సూచించారు. బస్సుల ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. డ్రైవర్లు వాహనం నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ముగ్గురు మృతి - Road accident in Palnadu district