Rottela Panduga Celebrations Second Day : నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కోలహలంగా సాగుతోంది. రెండోరోజు రొట్టెల పండుగ సందడిగా జరుగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం జన సముద్రమైంది. గంధ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారాషాహీద్ సమాధులను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
Nellore Rottela Festival 2024 : కోరికల రొట్టెలు ఇచ్చి, పుచ్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. కోర్కెలు నెరవేరిన వారు రొట్టె వదులుతుంటే, అదే కోరిక కోరుకునేవారు వాటిని పట్టుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, సౌభాగ్యం, వ్యాపారం, ఇల్లు, ఆరోగ్యం, పెళ్లి, సంతానం ఇలా రకరకాల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో అపరిశుభ్రతకు తావు లేకుండా కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
నెల్లూరులో రొట్టెల పండుగ - భారీగా తరలివచ్చిన భక్తులు - Nellore Rottela Panduga
'మేము తొమ్మిదేళ్లుగా రొట్టెల పండుగకు వస్తున్నాం. ఇక్కడ వస్తున్నప్పటి నుంచి మాకు మంచి జరుగుతుంది. ఈ పండుగకు భారీగా భక్తులు రావడానికి కారణం వారికి ఉన్న విశ్వాసమే. మేము ఐశ్వర్యం రొట్టె కోసం వచ్చాం. మంచి సంపద కలుగుతుందనే నమ్మకంతో ఐశ్వర్యం రొట్టె కోసం వచ్చాము.' - భక్తులు
ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మతాలకు అతీతంగా జరుగుపుకునే పండగకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కోరిన కోర్కెలు తీరుతున్నాయని. అందుకే మళ్లీ వచ్చామంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపైనా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అందించారు. ఎక్కెడెక్కడ నుంచో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. మరో మూడు రోజులపాటు ఈ పండుగ కొనసాగనుంది.
బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధం- నెల 17నుంచి వేడుకలు - Nellore Rottela Festival 2024