PM Modi Fire on YSRCP: నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైఎస్సార్సీపీ మోసం చేసిందని నరేంద్ర మోదీ తెలిపారు. పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పని చేసిందని దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. మేం వచ్చాక అన్ని మాఫియాలకూ పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల.. రాయలసీమ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతం, రాయలసీమ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వికాసం మోదీ లక్ష్యం, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోదీ తెలుగులో చెప్పారు. నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి బుల్లెట్ రైలు కావాలా.. వద్దా అని ప్రశ్నించిన మోదీ అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటువేయాని పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యమన్న మోదీ, కేంద్ర పథకం జల్‌జీవన్ మిషన్‌కు వైసీపీ ప్రభుత్వ సహకారం అందలేదని మోదీ వెల్లడించారు.
విపక్షాలకు పాకిస్థాన్‌పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను మళ్లీ తెస్తుంది: ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. గల్ఫ్‌కు వెళ్లే భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. ఖతార్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా రప్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను మళ్లీ తెస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిర్‌కు తాళం వేస్తుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేయాలనిచూస్తోందని మోదీ మండిపడ్డారు. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడుతుందన్నారు. భారత్.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది, కానీ తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.