ETV Bharat / state

ఫైళ్లను తగులబెట్టిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం - పూర్తిస్థాయి విచారణకు ఆదేశం - apmdc documents burnt Issue - APMDC DOCUMENTS BURNT ISSUE

PCB And APMDC Documents Burnt Issue: కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కీలక దస్త్రాలతో పాటు కంప్యూటర్‌ హార్డు డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఘటనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని ఆధికారులను ఆదేశించారు.

PCB And APMDC Documents Burnt Issue
PCB And APMDC Documents Burnt Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 9:30 PM IST

PCB And APMDC Documents Burnt Issue: విజయవాడ శివారులోని యనమలకుదురు కృష్ణా నది కరకట్టపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాళిక శాఖల దస్త్రాలు తగులబెట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో పీసీబీ మాజీ ఛైర్మన్‌ సమీర్‌ శర్మ, ఓఎస్​డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్‌ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగి రామారావును విచారణకు పిలిచారు. రామారావు ఎక్సైజ్‌ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు.

కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్​డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా చెప్పుకొంటున్నారు. ఇటీవల పీసీబీపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష సందర్భంగా తీసుకున్న ఫొటోతో ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్‌ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నట్లు ఎక్సైజ్‌శాఖలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యులతో రామారావు అంటకాగారని, ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్వోఆర్‌ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి.

కృష్ణానది కరకట్టపై ప్రభుత్వ దస్త్రాలు దహనం - విచారణకు ప్రభుత్వం ఆదేశం - Inquiry on Burning of Documents

2014-19 మధ్య ఆయన అక్రమాలపై సీఎం చంద్రబాబుకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఫైళ్ల దహనం వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. పీసీబీ దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. పీసీబీకి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ కల్యాణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని, పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకెళ్లాలన్నారు.

ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ విమర్శించారు. అందువలనే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బోడె ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో అవి వెలుగులోకి వస్తాయనే భయంతోనే వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులు దస్త్రాల దహనానికి యత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కొన్ని సీఎంవోకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులను తగలబెట్టారని మండిపడ్డారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. దీనిపై అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు.

పీసీబీ దస్త్రాల దహనంపై పవన్ కల్యాణ్​ ఆరా - కీలక ఆదేశాలు - pawan kalyan on pcb documents issue

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.