ETV Bharat / state

చిలకలూరిపేటలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు- ముఖ్య నేతలతో 13 కమిటీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:06 PM IST

Party Leaders Arrangements Was Chilakalurpet Public Meeting: చిలకలూరిపేటలో జరగనున్న ఉమ్మడి బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుంచి 5 నుంచి 6 లక్షల మంది తరలి రావచ్చని అంచనాతో ముందుగానే పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. సభ నిర్వహణకు మూడు పార్టీల ముఖ్య నేతలను 13 కమిటీలుగా ఏర్పాటు చేశారు.

Party Leaders Arrangements Was Chilakalurpet Public Meeting

Party Leaders Arrangements Was Chilakalurpet Public Meeting: చిలకలూరిపేటలో ఈ నెల 17న జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ- జనసేన- బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ సభకు హాజరు కానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద పార్టీగా టీడీపీ ఉన్నందున ఎక్కువ బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ,జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా ఈ సభ బాధ్యతలను స్వీకరించారు. శంఖారావం సభ తర్వాత అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయన హుటాహుటిన విజయవాడ వచ్చారు. ఈ సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ముఖ్య నేతలతో మాట్లాడారు. వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు మించి ప్రజలు ఈ సభకు హాజరవుతారని టీడీపీ, మిత్రపక్షాల నేతలు అంచనా వేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు.

టీడీపీ, జనసేనతో పొత్తు సంతోషకరం - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

వాటిలో ప్రధానమైన సమన్వయ కమిటీలో అచ్చెన్నాయుడు, లోకేశ్, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, జనసేన ప్రతినిధులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, బీజేపీ ప్రతినిధులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఉన్నారు. వేదిక నిర్వహణ కమిటీ బాధ్యతలను కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్, జనసేనకు చెందిన మల్లినీడి తిరుమలరావు, రామకృష్ణకు అప్పగించారు. సభా ప్రాంగణ కమిటీలో అలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితర నేతలను నియమించారు. ఆహార, తాగునీటి కమిటీ బాధ్యతల్ని ప్రత్తిపాటి పుల్లారావు, మద్దులూరి మాల కొండయ్య జనసేన నుంచి మోకా నానికి అప్పగించారు. ప్రజా సమన్వయ, మీడియా, వసతి సదుపాయాలు, పార్కింగ్, వాలంటీర్ సమన్వయ, రవాణా, నగర అలంకరణ, వైద్య సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీల్లోనూ ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించారు.

17న చిలకలూరిపేటలో 3 పార్టీల తొలి బహిరంగ సభ - పాల్గొననున్న ప్రధాని మోదీ

టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలు పొత్తు కుదిరిన తర్వాత మొదటిగా ఏర్పాటు చేస్తున్న సభ కావడంతో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు విచ్చేసే వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం టీడీపీకి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి బహిరంగ సభలను తెలుగుదేశం పార్టీ విజయవంతం చేసింది.

ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపిన ఎన్డీఏ నేతల ట్వీట్లు- రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడదామంటూ ప్రకటనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.