Candidate Nominations for AP Elections : నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కీలక ఘట్టానికి అడుగులు పడ్డాయి. ఊరూవాడా నామినేషన్ల కోలాహలం మొదలైంది. అభ్యర్థులు అనుచరగణంతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఆర్వో కార్యాలయానికి తరలివెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో ఉదయం 11 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మంగళగిరి సీతారామ కోవెలలో నారా లోకేశ్ నామినేషన్ పత్రాలకు కూటమి నేతల పూజలు చేశారు. మతపెద్దలు ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ర్యాలీ చేపట్టారు. కూటమి కార్యకర్తలు బైక్‌లపై వేలాదిగా చేరుకుని నినాదాలు చేస్తూ తరలి వెళ్తున్నారు.
నేడు నారా లోకేశ్ - రేపు చంద్రబాబు నామినేషన్ దాఖలు - Chandrababu Nomination in kuppam
లోకేశ్ నామినేషన్‌ను సమర్పించనున్న కూటమి నేతలు: మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేశ్ తరపున నామపత్రాలను కూటమి నేతలు మంగళగిరి ఆర్వో కార్యాలయంలో దాఖలు చేయనున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామపత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత ఆర్వోకు నామపత్రాలను సమర్పించనున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ వేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నారు. కూటమి గెలుపు ఖాయమని జయనాగేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఏపీలో మే 13న ఎన్నికలు - నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ - AP ELECTIONS 2024
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన కుటుంబసభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. కేశవ్ సతీమణి హేమలత, కుమారుడు విజయసింహ ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని రిటర్నింగ్ అధికారిణి, జేసీ గీతాంజలి శర్మకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఈనెల 25న మరోమారు యార్లగడ్డ రెండో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలి - ప్రతిరోజు నివేదికలివ్వాలి: కలెక్టర్లకు సీఈవో ఆదేశం
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ముందుగా వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయానికి వైసీపీ అభ్యర్థులు కూడా రావడంతో గొడవ జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను చెదరకొట్టడంతో గొడవ సద్దుమణిగింది. కావలిలో వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తరపున అతని నామినేషన్ పథ్రాన్ని ఆయన తల్లి మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఆమె మరో కుమారుడు కలిసి ఆర్ఓకు సమర్పించడంతో నామినేషన్ తొలి బోణీ అయింది.
ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ - Nomination Process For AP Elections