Minor Girl Commited Suicide in Kurnool District : ప్రేమ పేరుతో బాలుడు వేధించడంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి(16)ని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో చోటుచేసుకుంది. వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న బాలిక దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చింది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇంట్లో బాలిక ఒక్కతే ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన బాలుడు (17) ప్రేమించాలని వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక పురుగు మందు తాగింది. అదే సమయంలో తాము ఇంటికి రాగా బాలుడు పరారయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్వస్థతకు గురైన తమ కుమార్తెను ద్విచక్రవాహనపై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని తల్లిదండ్రులు తెలిపారు. అక్కడ పరీక్షించగా అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.
హైదరాబాద్లో పరిచయమైన ఆంధ్రా జంట - "మహి, శైలు" మీరెందుకిలా చేశారు?