ETV Bharat / state

విజయవాడ మెట్రో అమరావతికి అనుసంధానం - కేంద్రమంత్రితో నారాయణ చర్చలు

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో మున్సిపల్ మంత్రి నారాయణ భేటీ - విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కీలక చర్చలు

minister-narayana-met-union-minister-manohar-khattar
minister-narayana-met-union-minister-manohar-khattar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 5:32 PM IST

Updated : Oct 22, 2024, 5:48 PM IST

Minister Narayana met Union Minister Manohar Lal Khattar : మున్సిపల్‌శాఖ మంత్రి మంత్రి నారాయణ ఢిల్లీలో పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి ప్రతిపాదించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నారాయణ కోరారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రమంత్రి ఖట్టర్‌ దృష్టికి తెచ్చారు. అమృత్‌ పథకం అమలుపై కూడా కీలక చర్చ జరిగింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఏపీలో మెట్రో ప్రాజెక్టులు పరుగులు - నాలుగు కారిడార్లుగా విశాఖ, రెండు దశల్లో విజయవాడ - అమరావతి - Metro Rail Projects in AP

గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. భూసేకరణనూ గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రాకతో మెట్రో ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్‌ మెట్రోకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్‌బీఎస్‌ నుంచి ఒక కారిడార్‌ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్‌ బందరు రోడ్డులో రానుంది. ప్రస్తుతం సుదీర్ఘ పైవంతెన ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

HUDCO Loan For Amaravati : రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ముందుకు వచ్చింది. ఈ మేరకు నారాయణకు ఈ అంశాన్ని ఆ సంస్థ సీఎండీ వెల్లడించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ ఆ సంస్థ ఎండీ సంజయ్ కుల్ శ్రేష్టతో సోమవారం భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఏపీ సీఆర్డీఏకు 11 వేల కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలియచేసింది.

ఇక జెట్ స్పీడ్​లో అమరావతి పనులు - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు

Last Updated : Oct 22, 2024, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.