ETV Bharat / state

ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు

Jagan Photos and YCP Colors For Central Schemes : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రచారం పీక్​కు చేరుకుంది. ఇప్పటికే ప్రచార యావతో పిల్లల స్కూలు పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింట జగన్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అంతకు మించి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను సైతం తమ పథకాలుగా చెప్పుకుంటోంది. చెప్పుకోవడమే కాకుండా ఏకంగా వైసీపీ పార్టీ రంగులు వేసి నీచ రాజకీయాలు చేస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు సొమ్మొకడిది సోకొకడిది అంటూ చర్చించుకుంటున్నారు.

Jagan_Photos_For_Central_Schemes
Jagan_Photos_For_Central_Schemes
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 8:21 PM IST

Jagan Photos and YCP Colors For Central Schemes : సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతను మనం వినే ఉంటాం. అచ్చం అదే సామెతను నిజం చేసి చూపిస్తోంది జగన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను తమ పథకాలుగా చెప్పుకోవడమే కాకుండా వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేసి నీచ రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి విషయాలపై కేంద్రం పలుమార్లు జగన్ ప్రభుత్వంపై కన్నెర్రజేసినా ప్రచార పిచ్చి మాత్రం పోలేదు. ఇప్పటికే ప్రచార యావతో పిల్లల స్కూలు పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటా జగన్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జగన్ బొమ్మలు పెడుతున్నారు.

ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇంటింటికి ఓ కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలని నిశ్చయించుకుంది. ఈ పథకానికి అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందల్లా గ్రామాలను ఎంపిక చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం.

Drinking Water Problem Konaseema District : ఈ పనులను జగన్ సర్కారు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించింది. ఇప్పటికి పనులు అప్పగించి నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా పనులు చేపట్టింది. అది కూడా లబ్థిదారులకు పూర్తిగా న్యాయం చేయకుండా తూతూమంత్రంగా కానిస్తున్నారు.

ప్రతి ఇంటింటికి కుళాయి వేయకుండా పది కుటుంబాలకు ఒకటి చొప్పును ఏర్పాటు చేస్తున్నారు. వేసిన వాటికి సైతం దిమ్మెలు కట్టకుండా వాటిని అలాగే భూమిలోనే వదిలేశారు. ఓవర్ హెడ్​ ట్యాంకులకు మాత్రం వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేసి జగనన్న ప్రభుత్వం చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది. ఇన్నీ నాటకాలు అడినా ప్రజల మంచినీటి కష్టాలు తీరాయా అంటే అది లేదు. నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజాధనంతో స్వప్రయోజనం.. 'సంపూర్ణ జగన్​ ప్రచార పథకం'.. అన్నింటా అన్న ఫొటోనే..

ఒక బిందె నిండా నీరు నిండాలంటే అరగంట సమయం పడుతుంది. ఒక్కో కుటుంబానికి రెండు బిందెల నీరు కూడా అందటంలేదు. నీటి కోసం పనులు మానుకోని గంటల తరబడి వేేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

'కోడి, బాతు గుడ్లు చూశాం కానీ.. ఈ వైఎస్సార్ గుడ్డేంటబ్బా..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.