ETV Bharat / state

సీఆర్‌డీఏ, జీఏడీ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం - బ్యాంకర్లతో కుమ్మక్కు - గుట్టుగా సంతకాలు - CRDA and GAD Illegal agreement

Illegal Agreement Between CRDA and GAD: అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది బహుళ అంతస్తుల భవనాలపై సీఆర్‌డీఏ, జీఏడీ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం కుదిరింది. ఏడాది కిందటే ఈ ఒప్పందంపై అధికారులు గుట్టుగా సంతకాలు చేశారు. అందులో పేర్కొన్న షరతుల్ని వారే అడ్డగోలుగా ఉల్లంఘించారు. భవనాలు ఎన్​పీఏ కాకుండా ఆపేందుకు బ్యాంకర్లతోనూ కుమ్మక్కయ్యారు.

Illegal_Agreement_Between_CRDA_and_GAD
Illegal_Agreement_Between_CRDA_and_GAD
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 1:22 PM IST

సీఆర్‌డీఏ, జీఏడీ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం - బ్యాంకర్లతో కుమ్మక్కు - గుట్టుగా సంతకాలు

Illegal Agreement Between CRDA and GAD: అసలు భవన నిర్మాణమే పూర్తికాకుండా, విద్యుత్తు, మంచినీరు వంటి వసతులు సమకూరకుండా నివాసం ఉండడం సాధ్యమేనా? భవనాల సామర్థ్యం బాగుంది, వాటిలో ఉండేందుకు అనుకూలమే అని ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా కాపురం ఎలా ఉంటారు? నిర్మాణ దశలో ఉన్నా అవి పూర్తయ్యాయని ధ్రువపత్రం ఇవ్వడం కుదిరే పనేనా? ఇలాంటి తప్పుడు ధ్రువపత్రాలు, ఉత్తర్వుల ఆధారంగా క్షేత్ర పరిశీలన లేకుండా ప్రభుత్వ అసమర్థతను బ్యాంకర్లు కప్పిపుచ్చేశారు. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో ఈ తతంగమంతా నడిచింది.

ప్రభుత్వం ఆదేశించినట్లు చేస్తున్న అధికారులతోపాటు బ్యాంకర్లూ కుమ్మక్కవడం బరితెగింపునకు పరాకాష్ఠగా చెప్పాలి. లీజు అగ్రిమెంట్ నుంచి అద్దె చెల్లింపు వరకు అంతా నాటకమే. ఈ భవనాలు నిరర్థక ఆస్తులు కాకుండా తప్పించుకునేందుకు సీఆర్డీఏ చాలా ఎత్తుగడలు వేసింది. నిర్మాణం పూర్తయిందని, నివాసం ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెలలో బోగస్‌ డేట్‌ ఆఫ్‌ కమెన్స్‌మెంట్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఆపరేషన్స్‌ పత్రాన్ని సమర్పించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 10న సీఆర్డీఏ సాధారణ పరిపాలన (General Administration) శాఖలోని వసతి విభాగంతో గుట్టుగా లీజు ఒప్పందం చేసుకుంది

బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్‌ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి

తాజాగా వెలుగుచూసిన ఈ ఒప్పందంలోని షరతులను అధికారులే ఉల్లంఘించారు. భవనాల సామర్థ్యం సక్రమంగా ఉందని, వాటిలో నివసించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని రోడ్లు, భవనాల శాఖ నుంచి సీఆర్డీఏ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తీసుకుని జీఏడీకి (General Administration) సమర్పించాలి. కానీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో రహదారులు, భవనాల శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. దీంతో సీఆర్డీఏ ఈ పత్రాన్ని జీఏడీకి అందజేయలేదు. అయినా జీఏడీ గత నెలలో పూర్తి కాని భవనాలకు అద్దె విడుదల చేస్తూ జీఓ నంబర్‌ 10 విడుదల చేసింది.

నివాసానికి అనువుగా లేకున్నా, అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయకపోయినా జీఓ ఎలా వచ్చిందో అంతుచిక్కని ప్రశ్నే. జీఓలు 37, 248 మార్గదర్శకాల మేరకు ఈ బహుళ అంతస్తుల భవనాల రకాలను బట్టి వాటికి అద్దెలను రహదారులు భవనాల శాఖ నిర్ణయిస్తుంది. ఐతే నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో రహదారులు భవనాల శాఖ అద్దెలను నిర్ణయించలేదు. అయినప్పటికీ ఒప్పందంలోని అంచనా మొత్తాలను ప్రామాణికంగా తీసుకుని అసంపూర్తి భవనాలకు జీఓ ద్వారా చట్ట విరుద్ధంగా సీఆర్డీఏకు అద్దె చెల్లించారు.

CRDA Notices to Amaravati Farmers: రాజధాని అమరావతిపై మరో కుట్ర.. ప్లాట్లను రద్దు చేసుకోవాలంటూ సీఆర్డీఏ నోటీసులు

భవనాలను అయిదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చేందుకు సీఆర్డీఏ, జీఏడీ మధ్య జరిగిన అగ్రిమెంట్ 2023 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పరస్పరం అంగీకరించిన షరతుల మేరకు రెన్యువల్‌ ఉంటుంది. ఏడాదికి మించి లీజు కాలపరిమితి ఉన్న ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే దాన్ని రిజిస్టర్‌ చేసుకోవాలి. అయితే అయిదు సంవత్సరాలకు లీజు ఒప్పందం చేసుకున్నా, దాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. కేవలం 100 నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పత్రంపై సీఆర్డీఏ ఎస్టేట్స్‌ జాయింట్‌ డైరెక్టర్, జీఏడీ వసతి ఎస్టేట్‌ అధికారి సంతకాలు చేసి మమ అనిపించారు.

దీని చట్టబద్ధతపై అనేక సందేహాలు నెలకొన్నాయి. నిర్మాణం పూర్తయి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు నివాసం ఉంటున్న ఫ్లాట్లకు మాత్రమే అద్దె చెల్లించాలి. ఒక్కరంటే ఒక్కరూ అక్కడ ఉండకుండానే గంపగుత్తగా 3 వేల 201 ఫ్లాట్లకు ప్రతి నెలా 6 కోట్ల 30 లక్షల రూపాయలను చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇప్పటి వరకు 6 రకాల సముదాయాల్లోని ఒక్క ఫ్లాట్‌ కూడా పూర్తి కాలేదు. తాగునీరు, విద్యుత్తు, లిఫ్టులు, అంతర్గత రహదారులు వంటి ఒక్క వసతి కూడా లేదు.

ఏపీ సీఆర్​డీఏ బాండ్ల రేటింగ్ మరోసారి కుదేలు - బీబీబీ ప్లస్ నుంచి సీ గ్రేడ్‌కు కుదించిన రేటింగ్ ఏజెన్సీలు

రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఎన్జీవోలు, గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు నివాసం ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2,560 కోట్ల అంచనాతో హౌసింగ్‌ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. యూబీఐ లీడ్‌ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం 2,060 కోట్లు రుణం మంజూరు చేయగా అందులో 1,950 కోట్లు సీఆర్డీఏకు విడుదలయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారెంటీ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. ఈ భవనాలు వినియోగంలోకి వచ్చాయని సీఆర్డీఏ బ్యాంకర్లకు చూపించకపోతే నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తారు.

అప్పుడు గ్యారెంటీ ఇచ్చిన ప్రభుత్వం ఆ రుణాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి. దీన్ని తప్పించుకునేందుకు గత నెలలో సీఆర్డీఏ బ్యాంకర్లకు తప్పుడు డీసీసీవో సమర్పించింది. తర్వాత 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు అద్దె నిమిత్తం 69.36 కోట్లు సీఆర్డీఏకు విడుదల చేస్తున్నట్లు జీఓ నంబర్‌ 10లో పేర్కొన్నారు. ఈ జీఓ, డీసీసీవోలను (Date of Commencement of Commercial Operations) ఆధారం చేసుకుని బ్యాంకర్లు ఎన్‌పీఏ (Non Performing Assets) కాకుండా చర్యలు ప్రారంభించారు. త్వరలో దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమవుతోంది.

హౌసింగ్‌ ప్రాజెక్టు నిరర్థక ఆస్థిగా మిగిలిందా అంతే సంగతి - జగన్‌ సర్కారు వైఖరితో రుణ సంక్షోభంలో సీఆర్డీఏ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.