HYDRA Demolishing Illegal Constructions In Madhapur: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కావూరి హిల్స్ పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారంటూ కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమ నిర్మాణాలు తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డు ఏర్పాటు చేశారు.
అయితే పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని కోర్టులో స్టే సైతం తెచ్చుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నకిలీ డాక్యుమెంట్లతో స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారని కనీసం అసోసియేషన్ వారిని సైతం స్పోర్ట్స్ కి అనుమతించడం లేదని కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.