ETV Bharat / state

ఏపీలో రూ.73,743 కోట్లతో రైల్వే పనులు- అమరావతి రైల్వే లైనుకు రూ.2,047 కోట్లు : అశ్వినీ వైష్ణవ్​ - Funds Allocate to AP Railway - FUNDS ALLOCATE TO AP RAILWAY

Ashwini Vaishnaw on Funds Allocate to AP Railway: ఏపీలో రైల్వేలకు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అమ‌రావ‌తి, విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ల అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌నులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Funds Allocated For Amaravati Railway Station
Funds Allocated For Amaravati Railway Station (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 3:47 PM IST

Updated : Jul 24, 2024, 7:30 PM IST

Ashwini Vaishnaw on Funds Allocate to AP Railway: ఆంధ్రప్రదేశ్​కు ఈ సంవత్సరం రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పది రెట్లు పెంచామన్నారు. కేంద్ర బడ్జెట్​లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో కూడా వంద శాతం రైల్వేలు విద్యుద్దీకరణ జరిగాయని కేంద్రమంత్రి అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు - నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం - Centre to Fully Finance Polavaram

ఏపీ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో పది సంవత్సరాలలో 743 అండర్‌ పాస్‌లు, పైవంతెనల నిర్మాణం జరిగిందన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని రైల్వేకు ఇతర భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. రైల్వేకు భూకేటాయింపులపై ఇటీవల చర్చలు కూడా జరిగాయని వివరించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు మొదలు కానుందన్నారు. ఎర్రుపాలెం- కొండపల్లి- నంబూరు మీదుగా రైల్వే లైను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతిఆయోగ్‌ ఆమోదించిందన్నారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

అమ‌రావ‌తి, విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ల అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉంది: అశ్విని వైష్ణవ్​ - Funds For Amaravati Railway Station

అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై లోక్‌సభలో ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విజ‌య‌వాడ స్టేష‌న్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనకాపల్లి స్టేషన్‌ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌నులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.

పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి - ఏపీ దశ, దిశ మార్చనున్న ఆ రెండు ప్రాజెక్టులు - infra development

Last Updated : Jul 24, 2024, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.