Family Get Together Of Five Generations in Anantapur : ఎవరికి వారే బతుకుతున్న రోజులివి. తల్లిదండ్రులతోనే కాదు, ఉద్యోగాలనో మరోటనో కనీసం జీవిత భాగస్వామితో కూడా కలిసి ఉండటం లేదు కొందరు. సాధారనంగా ఈ రోజుల్లో పండగలకో, అతి ముఖ్యమైన కార్యక్రమాలకో తప్ప ఒక కుటుంబ సభ్యులంతా కలవడమే గొప్ప. కానీ వారు మాత్రం ఐదు తరాల వారంతా ఏడాదికి ఒకసారి తప్పకుండా కలుస్తారు తెలుసా. ఆ కుంటుంబం గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని నార్సింపల్లికి చెందిన గుంటిపల్లి శేషప్ప, నారప్ప 5 తరాల కుటుంబీకులు ఒకే వేదికపై కలుసుకున్నారు. రెండు కుటుంబీకులు శని, ఆదివారాల్లో గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ఆట పాటలతో రెండు రోజులపాటు సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ 15 ఏళ్లుగా ప్రతి మూడేళ్లకోసారి ఇలా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు.
శాసించే స్థాయికి చేరుకున్నా ఏదో వెలితి! 50 ఏళ్ల స్నేహబంధంలో అందమైన రోజు ఇది
తామంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డామని ఒకరినొకరిని కలుసుకునేందుకు, చూసుకునేందుకు వీలు కుదరడం లేదని, ఎలాగైనా వారంతా కలవాలని ఈ సంప్రదాయానికి నాంది పలికామన్నారు. ఇలా వారందరూ కలుసుకోవడం వల్ల మానసిక ఆనందం ఉల్లాసం కలుగుతుందన్నారు. మా పిల్లలకు మన వాళ్లు ఎవరనేది తెలియాలనే ఉద్దేశం ఈ సమ్మేళనం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మేమంతా ఒకరినొకరి కలిసి సాదకబాధలు పంచుకుంటామని వారు తెలుపుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించేందుకు, మేమున్నాం అని మా వాళ్లకు మనోధైర్యం, నమ్మకం కల్గించడానికి ఈ సమ్మేళనం దోహదం చేస్తుందని వారు వివరించారు.
తూర్పుగోదావరిలో తాడి వంశీయుల ఆత్మీయ కలయిక.. హాజరైన 400 మంది..