Electricity Bill Hike in YCP Government: జగనన్న పాలనలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పేరెత్తితే జనం హడలిపోతున్నారు. ఇలాంటి జాబితాలో షాక్ కొట్టే మరొకటి కూడా ఉందంటే అది విద్యుత్ బిల్లు. ప్రతి నెలా రీడింగ్ తీసి చేతిలో పెట్టే ఆ బిల్లు చూసిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. మనం ఎంత కరెంటు వాడాం ఎంత బిల్లు వచ్చింది అనే చర్చ జరుగుతోంది. వినియోగించిన విద్యుత్తుకు లెక్క కట్టి రుసుం ఎంత చూపుతున్నా ఆ తరువాత క్రమంలో ఉన్న ఒక్కొక్క వరుస చదివిన ఎవరైనా తెల్లబోవాల్సింది. మొత్తంగా జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ బటన్ నొక్కుతున్నాంగా అంటూ తప్పించుకునే ధోరణిలో పాలించారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
YCP Put Burden of Electricity Charges on People: వైసీపీ సర్కార్ అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం భారీగా మోపింది. కొన్ని వర్గాల కనెక్షన్లకు సంబంధించి టారిఫ్‌లో మార్పులు చేయకపోయినా స్లాబులు మార్చి దొడ్డి దారిన ఛార్జీలు పెంచేశారు. వీటికి అదనంగా 2022 ఆగస్టు నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రెండు విడతల ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు ఛార్జీలను వడ్డిస్తున్నారు. సామాన్యుల కరెంటు బిల్లులో ఈ వడ్డింపులే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటున్నాయి.
అదే పారిశ్రామిక, వాణిజ్య వర్గాల బిల్లుల్లో అదనపు సుంకాలు రూ.వేలల్లో ఉంటున్నాయి. అందుకే కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొట్టేలా ఉన్నాయి. 2022-24లో విశాఖ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి జిల్లా వినియోగదారులపై వివిధ రూపాల్లో రూ.964 కోట్లు అదనపు ఛార్జీల భారం మోపారు. ఈ సంవత్సరం ఎన్నికలు ఉండటంతో పెంపు జోలికి పోలేదు. డిస్కంలు మరో రూ.7 వేల కోట్లు ట్రూఅప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ వద్ద ప్రతిపాదనలు పెట్టారు. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపై మోపడానికి సిద్ధంగా ఉంచారు.
అయ్యో నాగయ్యా! కూలీ ఇంటికి లక్ష రూపాయల కరెంటు బిల్లు
ట్రూఅప్ ఛార్జీలతో యూనిట్‌కు 17 పైసలు చొప్పున సర్కిల్ మొత్తం వినియోగంపై నెలకు రూ.11.9 కోట్లు వసూలు చేస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.202.3 కోట్లు వసూలు చేశారు. ఎఫ్‌పీపీసీఏ-2 పేరుతో 2023 మే నెల నుంచి యూనిట్‌కు 40 పైసలు చొప్పున మరో భారం మోపుతున్నారు. విద్యుత్తు సర్కిల్‌లో సగటున నెలకు రూ.70 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన 40 పైసలు చొప్పున నెలకు రూ.28 కోట్లు అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి రూ.28 కోట్లు చొప్పున రూ.336 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సి ఉంటుంది.
కరెంట్ బిల్లు షాక్ కొట్టిందా?- #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి: లోకేశ్
మూడు నెలలకు ఒకసారి చెల్లించిన విద్యుత్ బిల్లుల నుంచి మొత్తం రూ. 852 కోట్లను ఎఫ్‌పీపీసీఏ-1 వసూలు చేసింది. నగరంలోని మద్దిలపాలేనికి చెందిన ఎ. అప్పలనాయుడు 2021 అక్టోబర్‌లో 185 యూనిట్ల విద్యుత్తు వినియోగించారు. అందుకు గాను సుంకాలతో కలిపి రూ.679 కరెంటు బిల్లు వచ్చింది. అదే వినియోగదారుడు ఈ ఏడాది జనవరిలో 157 యూనిట్లే వినియోగించారు. బిల్లు మాత్రం రూ.919 వచ్చింది. వాస్తవానికి 185 యూనిట్లు వినియోగించినప్పుడు రూ.679 బిల్లు వస్తే 157 యూనిట్లు వాడినప్పుడు బిల్లు ఇంకా తక్కువగా రావాలి. కానీ జగనన్న పాలనలో అదనపు సుంకాల కారణంగా కరెంటు తక్కువ వాడినా రూ.240 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇందులో టారీఫ్ ప్రకారం విద్యుత్తు ఛార్జీలు రూ.609. మిగతా అదనపు సుంకాలే రూ.310 ఉండడంతో బిల్లు రూ.919 పెరిగిపోయింది. ఈ బిల్లు ఒక్కరోజు ఆలస్యమైనా అదనంగా మరో రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
విద్యుత్ బిల్లులు షాక్ కొట్టకుండా చూస్తున్నాం: జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి