EC Suspend SPs in AP : ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల సంఘమే అయినా క్షేత్రస్థాయిలో బాధ్యతలన్నీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే ఉంటాయి. విధి నిర్వహణలో ఎక్కడ పక్షపాతం చూపినా, నిర్లక్ష్యం వహించినా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి.
EC Transfer Police Officers in AP : పల్నాడు జిల్లాలోనూ అదే జరిగింది. పల్నాడు జిల్లా ఎస్పీగా ఈ ఏడాది ఏప్రిల్ 6నే బాధ్యతలు చేపట్టారు బిందుమాధవ్. గతంలో అక్కడ పని చేసిన రవిశంకర్ రెడ్డిని అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పల్నాడులో శాంతిభద్రతలు కట్టడి చేయటంలో విఫలమయ్యారని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ స్థానంలో వచ్చిన బిందుమాధవ్ కూడా కఠినంగా వ్యవహరించలేక పోయారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయాల్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తగలబెట్టినా, మాచర్లలో దాడులు జరిగినా నిందితుల్ని పట్టుకోవటంలో ఎస్పీ విఫలమయ్యారు. నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ రౌడీలు కర్రలు, రాడ్లతో స్వైర విహారం చేసినా నియంత్రించలేకపోయారు. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, అదనపు బలగాల్ని రప్పించి కట్టడి చేసే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. చివరకు జరగాల్సిన నష్టం జరిగాక 144సెక్షన్ పెట్టారు. సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇక పల్నాడు జిల్లా ఆవిర్భావం నుంచి లోతేటి శివశంకర్ కలెక్టర్ పని చేస్తున్నారు. రెండేళ్లకు పైగా ఇక్కడే ఉన్న ఆయన, సార్వత్రిక ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘర్షణలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో అలాంటివి పునరావృతం కాకుండా చూడలేకపోయారు. శివశంకర్ కేవలం ఎన్నికల విధులపైనా దృష్టి సారించి పోలీసులతో సమన్వయం చేసుకోలేకపోయారనే విమర్శలున్నాయి. జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో శాంతిభద్రతల నిర్వహణ కూడా కలెక్టర్ బాధ్యత. దాన్ని శివశంకర్ గుర్తించలేకపోయారు. బదిలీ వేటుకు గురయ్యారు. ఇక నరసరావుపేట డీఎస్పీ వర్మ, గురజాల డీఎస్పీ పల్లపురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు, ప్రభాకర్ రావు, బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్సై రామాంజనేయులు, నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డిపై పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థుల కదలికలను వైసీపీ వారికి చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారిపైనా చర్యలు తప్పలేదు.
ఇక తిరుపతి జిల్లా ఎస్సీ కృష్ణకాంత్ పటేల్ విధి నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార వైఎస్సార్సీపీ నిల్వ చేసిన ప్రచార సామగ్రి పెద్ద ఎత్తున బయటపడితే గోదాముల వాచ్ మెన్లు, మెనేజర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు! ఇక పద్మావతీ వర్సిటీలో పులివర్తి నానిపై హత్యాయత్నం ఎస్పీ కృష్ణకాంత్ వైఫల్యానికి పరాకాష్ట! అందుకే కృష్ణకాంత్‌తోపాటు తిరుపతి డrఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డrఎస్పీ భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ, డీఎస్పీ రంగయ్య టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల రాళ్ల దాడుల్ని అడ్డుకోలేకపోయారు. దానికి వారిద్దరితోపాటు ఎస్పీ అమిత్ బర్దర్ కూడా ఈసీ ఆగ్రహానికి గురయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ - CS and DGP Explanation to EC