CP Rajasekhar Babu on Traffic Problems in Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ అంబాసిడర్లను ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఎక్కడైనా ట్రాఫిక్ జాం కాగానే వెంటర్ వాట్సాప్ గ్రూపులో ఫొటోస్ అప్లోడ్ చేయాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించామని తెలిపారు. 112 నుంచి 72కి కిలోమీటర్ల అంతరాయాన్ని తగ్గించామని సీపీ వివరించారు. అస్త్రం ఆప్‌లో రియల్ టైం డేటా సేకరించి చేసి ప్రజలకు సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ట్రాఫిక్ తగ్గించాలంటే టెక్నాలజీ ఉపయోగించాలని, ట్రాఫిక్ అంతరాయం ఎక్కడుంటుందో డ్రోన్ అక్కడ ఉంటుందని సీపీ వెల్లడించారు. ట్రాఫిక్ని పసిగట్టి వెంటనే సమాచారాన్ని చేరవేస్తుందని గుర్తు చేశారు. అనేక సందర్భాలలో ఫిజికల్ పోలీసింగ్ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ, అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్‌ని గుర్తించడమే ఈ ఆప్ పని తీరని ఆయన తెలిపారు. ఈ యాప్‌ని ఉపయోగించడం వల్ల పోలీసులు త్వరగా స్పందిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే జంక్షన్ కానిస్టేబుల్లకు సూచనలను అందిస్తున్నామని అన్నారు. రెడ్ ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్‌పై మెసేజ్‌లను అందిస్తున్నామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
వలస జీవితాలను మార్చేసిన 'కియా' కారు - వేలాది కుటుంబాల్లో వెలుగులు
ఫీడ్ బ్యాక్ మెకానిజంలా అస్త్రం యాప్: త్వరలోనే ఎల్ఈడీ బోర్డులను 5 జంక్షన్లో ఏర్పాటు చేయబోతున్నామని, కొన్ని డ్రోన్లను వెస్ట్ బైపాస్‌కి, రామవరప్పాడు రింగు రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇకపై ట్రాఫిక్ ఎలా ఉండబోతుందనేది అస్త్రం అనే ఏఐ టూల్ ద్వారా తెలుసుకుంటామని సీపీ అన్నారు. డిసెంబర్లో ట్రాఫిక్ ఇంకొంచెం మెరుగుపడే విధంగా మార్పులను చేసిన్నట్లు తెలిపారు. డీసీపీ గౌతమి బెంగుళూరులోని ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పినప్పుడు ఇక్కడ కూడా స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని ఆలోచన చేసామని అన్నారు. ఒక ఫీడ్ బ్యాక్ మెకానిజంలా అస్త్రం యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌లను పటిష్ట పరుస్తు, విప్లవాత్మకమైన మార్పులను ట్రాఫిక్‌లో చేయబోతున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.
విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో విప్లవాత్మకమైన మార్పుల చేస్తాం. సమస్యల పరిష్కారానికి ట్రాఫిక్ అంబాసిడర్లను ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ జామ్ అయితే వెంటర్ వాట్సప్ గ్రూపులో ఫొటోలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. అస్త్రం యాప్‌లో డేటా సేకరించి ప్రజలకు సేవలు అందిస్తాం. ట్రాఫిక్ అంతరాయాలను డ్రోన్ పసిగట్టి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తుంది. త్వరలో ఐదు జంక్షన్లలో ఎల్‌ఈడీ బోర్డుల ఏర్పాటు చేస్తాం.- రాజశేఖర్‌బాబు, సీపీ
దుర్గగుడి అభివృద్ధికి 100 కోట్లు! - వందేళ్ల ప్రణాళిక దిశగా కసరత్తు
ఎర్రమలగుహల్లో ఆదిమానవుడి పెయింటింగ్స్ - దాచేస్తున్న మైనింగ్ మాఫియా