ETV Bharat / state

చారిత్రక ఖమ్మం ఖిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దేలా అడుగులు - నెల రోజుల్లో డీపీఆర్ సిద్ధం!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 9:14 AM IST

Congress Govt Focus On Development Of Khammam Fort : ఖమ్మం జిల్లా కీర్తికిరీటంలో చెక్కుచెదరని ముద్రవేసిన ఖమ్మం ఖిల్లా చారిత్రక వైభవాన్ని చాటిచెప్పడం సహా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Development Of Khammam Fort
Congress Govt Focus On Development Of Khammam Fort

Congress Govt Focus On Development Of Khammam Fort : కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఖమ్మం ఖిల్లాను ఆధునిక హంగులతో సరికొత్త పర్యాటక ప్రాంతంగా భావితరాలకు సరికొత్తగా అందించేందుకు అవసరమైన అడుగులు పడుతున్నాయి. ఖిల్లా చారిత్రక నేపథ్యాన్ని వివరించడం సహా పర్యాటకంగా తీర్చిదిద్ది ఖమ్మం నగరసిగలో మరో మణిహారంలా మార్చేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈమేరకు మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య .. ఎనిమిదేళ్లలో ఎంతమంది వచ్చారంటే?

Development Of Khammam Fort : ఖమ్మం జిల్లా కీర్తికిరీటంలో చెక్కుచెదరని ముద్రవేసిన ఖమ్మం ఖిల్లా చారిత్రక వైభవాన్ని చాటిచెప్పడం సహా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. వెయ్యేళ్లు దాటినా చెక్కు చెదరకుండా రాజులకు రక్షణ కవచంగా ఆయుధ బాంఢాగారంగా, ప్రస్తుతం ఖమ్మం నగరానికి తలమానికంగా ఉండి ఎన్నో వింతలు విశేషాలను తనలో దాచుకున్న ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కీలక ముందగుడు పడింది.

కాకతీయుల కళావైభానికి ప్రతీకగా నిలిచి ఖమ్మం నగర ఖ్యాతిని ఇనుమడింప జేస్తున్న ఖిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి సరికొత్త పర్యాటక ప్రాంతంగా జిల్లా వాసులకే కాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ మొదలైంది. ఖమ్మం ఎమ్మెల్యేగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఖిల్లా సమగ్రాభివృద్ధి ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖమ్మంకి తలమానికంగా నిలవడంతోపాటు పర్యాటకుల మదిని దోచేలా ఖిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి తుమ్మల ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖిల్లా సమగ్రాభివృద్ధి సహా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఖిల్లాపైకి రోప్‌వే సదుపాయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం తమిళనాడు, కేరళ నుంచి సాంకేతిక నిపుణులను రప్పించాలని యోచిస్తున్నారు. ఖిల్లా ప్రాంగణం మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా సుందరీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రణాళికలు చేయనున్నారు. రాత్రి వేళల్లో వెలుగు జిలుగుల మధ్య ఖిల్లా జిగేల్‌మనేలా ఏర్పాట్లుచేయాలని భావిస్తున్నారు.

రాత్రివేళల్లో ఖిల్లానుంచి చూస్తే ఖమ్మం ద్విగిణీకృతం అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు కలిసి మరోసారి ఖిల్లాను పూర్తిస్థాయిలో సందర్శించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని దిశానిర్దేశం చేశారు. ఖిల్లా సమగ్రాభివృద్ధికి నెల రోజుల్లోగా డీపీఆర్ సమర్పించాలన్న సచూంచారు. సర్కారు చర్యలతో త్వరలోనే ఖిల్లా కొత్త సొగబులు అద్దుకునే అవకాశాలుకనిపిస్తున్నాయి.

హుస్సేన్‌సాగర్‌ వద్ద మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో.. ఎప్పటినుంచంటే..!

Tourist Visa Problems పర్యాటక వీసా విసిగి వేసారేలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.