ETV Bharat / state

మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం: చంద్రబాబు - Telugu Language Day in Vijayawada - TELUGU LANGUAGE DAY IN VIJAYAWADA

Chandrababu Speach In Telugu Language Day: మాతృభాషను మరిచిపోతే జాతి కనుమరుగు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. జీవో నెంబరు 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు.

Chandrababu Speach In Telugu Language Day Celebrations
Chandrababu Speach In Telugu Language Day Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 10:13 PM IST

Chandrababu Speach In Telugu Language Day Celebrations: మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు సీఎంకు స్వాగతం పలికారు.

భాష మరిచిపోతే జాతి కనుమరుగవుతుంది : మాతృభాషను మరిచిపోతే జాతి కనుమరుగు అవుతుందని చంద్రబాబు అన్నారు. పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్‌ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడతామని హామీ ఇచ్చారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. భాష మరిచిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. జీవో నెంబరు 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండాలని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రభుత్వాలు, కోర్టులు తెలుగులో ఇవ్వాలి : వెంకయ్యనాయుడు - Telugu Language Day Celebrations

మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలి : త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. దేశంలో అధికంగా మాట్లాడుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. ఆంగ్లం వస్తేనే ఉద్యోగాలు, డబ్బులు వస్తాయని అపోహ ఉందని, పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని అన్నారు.

కూచిపూడి తెలుగుజాతి వారసత్వ సంపద : తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్లు కూచిపూడిని మరిచిపోతున్నారని అన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్లు కూచిపూడిని మరచిపోలేదని గుర్తు చేశారు. కూచిపూడి తెలుగుజాతి వారసత్వ సంపదని, కూచిపూడిని కాపాడే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తెలుగు భాష బతుకుతుంది : మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. తెలుగు కోసం, తెలుగు జాతి కోసం గిడుగు రామ్మూర్తి పోరాడారని, సాహిత్యంలో వాడుక భాష ఉండాలని గిడుగు రామ్మూర్తి తపన పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడేవారిని గౌరవిస్తేనే తెలుగు భాష బతుకుతుందని అన్నారు. మాతృభాష బోధించే వారికి జీతభత్యాలు ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. జీవో 77తో భాషా పండితులకు అన్యాయం జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధ్యయనం చేసి భాషా పండితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

తెలుగు భాషోత్సవం- గిడుగు స్ఫూర్తిని అందుకోలేకపోతున్న యువతరం - telugu language day celebrations

తెలుగు భాషకు వన్నెతెచ్చిన గిడుగు బాటలోనే పయనిస్తున్నామా - మరి లోపం ఎవరిది? - Telugu Language Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.