ETV Bharat / state

భువనేశ్వరి అరకు కాఫీ రుచి ఎలా ఉంది ? - చంద్రబాబు ట్వీట్​ - 'నచ్చిందంటూ' రిప్లై

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 3:12 PM IST

Updated : Feb 28, 2024, 7:44 PM IST

Chandrababu Tweet to Bhuvaneswari on Araku Coffee Taste: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అరకు కాఫీ రుచి చూశారు. కాఫీ రుచి ఎలా ఉందంటూ ఎక్స్ వేదికగా భువనేశ్వరిని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నకు భువనేశ్వరి ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు. పాడేరులో గిరిజన మహిళలతో కలిసి భువనేశ్వరి థింసా నృత్యం చేసి ఉత్సాహపరిచారు.

Chandrababu Tweet to Bhuvaneswari on Araku Coffee Taste

Chandrababu Tweet to Bhuvaneswari on Araku Coffee Taste : నిజం గెలవాలి యాత్రలో భాగంగా అరకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని అరకు (Araku) మండలం ముసిరిగుడ గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పర్యటనలో భాగంగా అరకు కాఫీ రుచి చూశారు. కాఫీ రుచి ఎలా ఉందంటూ ఎక్స్ వేదికగా భువనేశ్వరిని చంద్రబాబు అడిగారు. 'మన గిరిజన సోదరులు పండించే అరకు రుచి ఎలా ఉందో చెప్పమంటూ' భువనేశ్వరికి చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu Questions on Araku Coffee : అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో అరకు సెంటర్‌లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద భువనేశ్వరి అరకు కాఫీని రుచి చూశారు. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించారు. చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని దొన్నుదొర ఆమెకు వివరించారు. అరకు ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూడా భువనేశ్వరి పరిశీలించారు. అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో అరకు ప్రాంతాన్ని, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని భువనేశ్వరి స్థానికులకు తెలిపారు.

పాడేరులో 'నిజం గెలవాలి' - గిరిజనులతో ఆడిపాడిన భువనేశ్వరి

చంద్రబాబు అడిగిన ప్రశ్నకు భువనేశ్వరి 'నచ్చిందండీ' అని బదులిచ్చారు. "మన కిచెన్‌లో అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ అరకు సుందర అందాలు, ఇక్కడి ప్రజల ప్రేమతో ఇది మరింత రుచిగా మారింది. మీరు దీన్ని గ్లోబల్‌ బ్రాండ్‌గా మార్చినందుకు గర్వపడుతున్నా" అని ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు.

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in Paderu : పాడేరులో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్థానిక మహిళలతో కలసి సరదాగా థింసా నృత్యం చేశారు. ఆడారిమెట్టలో దింసా కళాకారులు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలసి కాలు కదిపారు. డప్పుల శబ్దాలకు అనుగుణంగా భువనేశ్వరి నృత్యం చేస్తూ అక్కడి వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

ఆడారిమెట్టలో భువనేశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీకి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు ఎన్నో పథకాలు తీసుకువచ్చారని ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనంత హత్యా వేదికగా మారిందని గుర్తు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచడం వల్ల అమాయకులైన 266 మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బలయ్యారని, వీరిని ఓదార్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారని భువనేశ్వరి పేర్కొన్నారు. ఇక్కడ గిరిజన మహిళలను చూస్తుంటే ఎంతో ఆనందంగా భువనేశ్వరి పేర్కొన్నారు. దేశ విదేశాల్లో అరకు కాఫీ బ్రాండ్​ను గుర్తింపు తెచ్చిన ఘనత టీడీపీదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు చూసి లోకేశ్ కుటుంబాన్ని వదిలి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని భువనేశ్వరి గుర్తు చేశారు. మోసపూరిత పాలనను అంతం అందించాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం - నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

Last Updated : Feb 28, 2024, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.