ETV Bharat / state

ఏపీలో సీఐడీ సిట్​ ఆఫీసుకు సీల్ - ఫైబర్ ఆఫీస్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు - AP Fibernet And Sit Offices Seized

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 9:57 PM IST

AP Fibernet and Sit Offices Seized : ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ ఫైబర్ ఆఫీస్, తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్​ను అధికారులు సీజ్ చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకే కార్యాలయాలకు తాళాలు వేశారు.

Fibernet and Sit Offices Seized
AP Fibernet and Sit Offices Seized (ETV Bharat)

AP Fibernet and Sit Offices Seized : ఏపీ ఫైబర్ ఆఫీస్​ను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరనీ బయటకు పంపించి ఆఫీస్​ను సీజ్ చేశారు. మరోవైపు తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్​ను సైతం అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీస్‌ను సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశాల్లో భాగంగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇప్పటికే చీఫ్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతి ఆఫీస్‌లలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దహనం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని దీనిపై టీడీపీ నేతలు ఆరోపించారు. సిట్ ఆఫీస్ సమీపంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు దహనం చేయడంపై అప్పట్లో గవర్నర్ నజీర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

హెరిటేజ్ పత్రాలను తగులబెట్టిన సీఐడీ అధికారులు! - సిట్ కార్యాలయం వద్ద కలకలం - Set Fire To Documents At SIT Office

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.