ETV Bharat / state

దిల్లీలోని ఏపీ భవన్‌ భూమి విభజన - తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారమైన పెద్ద ఆస్తి వివాదం - AP Bhavan Land in Delhi Divided

AP Bhavan Land in Delhi Divided: దిల్లీలోని ఆంధ్రరత్న భవన్‌ భూమిని కేంద్ర ప్రభుత్వం పంచింది. దీంతో పదేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఆస్తి వివాదం పరిష్కారమైనట్లయింది.

AP_Bhavan_Land_in_Delhi_Divided
AP_Bhavan_Land_in_Delhi_Divided
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 2:12 PM IST

దిల్లీలోని ఏపీ భవన్‌ భూమి విభజన- తెలుగురాష్ట్రాల మధ్య పరిష్కారమైన పెద్ద ఆస్తి వివాదం

AP Bhavan Land in Delhi Divided: దిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ భూమిని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు పంచింది. దిల్లీ నడిబొడ్డున ఎకరా 501 కోట్ల రూపాయలు విలువ చేసే 19.71 ఎకరాల భూమిని 58.32, 41.68 శాతం నిష్పత్తిలో పంచింది. మొత్తం 9వేల 913 కోట్ల 50 లక్షల విలువైన ఈ భూమిలో రాష్ట్రానికి 5వేల 781 కోట్ల 41 లక్షల రూపాయల విలువైన 11.536 ఎకరాలు, తెలంగాణకు 4వేల 132కోట్ల 8 లక్షల విలువైన 8.245 ఎకరాలు దక్కాయి.

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్రమ‌త్తమైన అధికారులు- ముమ్మరంగా ఫ్లెక్సీల తొలగింపు

విభజన చట్టంలో చెప్పిన సూత్రాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విధానం ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ భూమిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఆస్తి వివాదం పరిష్కారం అయినట్లయింది. మార్చి 11న జరిగిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో రెండు ప్రభుత్వాలూ అంగీకరించిన ఆప్షన్‌-జీ ప్రకారం భవన్‌ ఆస్తులను విభజించినట్లు హోంశాఖ శుక్రవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.

బహుముఖ వ్యూహాలతో ప్రచారాలు- బైక్​ ర్యాలీలతో మద్దతు తెలుపుతున్న అభిమానులు

'ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో అశోకరోడ్డు చివరలో ఉన్న గేట్‌ను భద్రతా కారణాల రీత్యా మూసేయాలి. భవన్‌ స్థలంలో ఇంకా 0.043 ఎకరాల్లో ఆక్రమణలున్నాయని, వాటిని తొలగించలేకపోతే ఆ మేరకు భూమిని ఇరు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో వదులుకోవాల్సి ఉంటుందన్న ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. రెండు ప్రభుత్వాలూ అంగీకరించిన ఆప్షన్‌-జీ ప్రకారం భవన్‌ ఆస్తులను విభజించాం. దీంతో దిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ ఆస్తుల పంపిణీని పూర్తి చేసినట్లయింది' అని హోంశాఖ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది.

.

చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి రానున్న ముగ్గురు అగ్రనేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.