ETV Bharat / state

భక్తుల సౌకర్యాలపై ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala - AP GOVT KEY CHANGES IN TIRUMALA

AP Govt Key Changes in Tirumala : సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేపట్టింది. గత వైఎస్సార్సీపీ పాలనలో సాధారణ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన అధికారులు గణనీయమైన మార్పులు చేశారు. దర్శనాల సంఖ్య పెంచడంతో పాటు, సౌకర్యాలను మెరుగుపరిచారు. ఫలితంగా ఒకే రోజు 85,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు.

AP Govt Key Changes in Tirumala
AP Govt Key Changes in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:53 AM IST

AP Govt Focus on Facilities in Tirumala : తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల కుదింపు, దివ్యదర్శనం టోకెన్ల పునరుద్ధరణ, క్యూలైన్ల నియంత్రణ, కంపార్ట్​మెంట్లలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాల విషయంలో గడచిన రెండు నెలల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. గత 5 ఏళ్లలో తిరుమల శ్రీవారి భక్తులకు దూరమైన వసతులు తిరిగి ప్రారంభమయ్యాయి. భక్తుల కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.

TTD Focus on Facilities to Devotees : తిరుమల వచ్చే భక్తులు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుని, భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి కార్యాచరణ ప్రారంభించారు. టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య చౌదరి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ భక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

షెడ్లు, కంపార్ట్‌మెంట్లు అందుబాటులోకి : గత ఐదేళ్ల వైఎస్సార్సీరీ పాలనలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పడిన కష్టాలపై టీటీడీ ఈఓ, అదనవు ఈఓ దృష్టి సారించారు. అధికారులతో సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, ఒకటో వైకుంఠం క్యూకాంపెక్ల్స్‌లోని కంపార్ట్​మెంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా సర్వదర్శనం, దివ్యదర్శనానికి వచ్చే భక్తులను తిరుమల మొత్తం క్యూలైన్లు తిరిగే సమస్య పరిష్కారమైంది.

"సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. భోజనం కూడా చాలా బాగుంది. కంపార్ట్​మెంట్లు, షెడ్లలో అన్నప్రసాదాలు, అల్పాహారాలు ఇచ్చారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. " - భక్తులు

భక్తులను నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌-1లో కంపార్ట్​మెంట్లలోకి అనుమతిస్తున్నారు. దీంతో అవి నిండిన తర్వాతనే క్యూలైన్లు బయటకు వస్తున్నాయి. వారంతాలు మినహా క్యూలైన్లు బయటకురావడం లేదు. అందులో వేచి ఉన్న భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం నిరంతరాయంగా అందచేస్తున్నారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో వితరణ చేసే అన్నప్రసాదాల నాణ్యతను పెంచారు. క్యూలైన్ల దూరం తగ్గడం, కంపార్ట్​మెంట్లలో అన్నప్రసాదాలు, అల్పాహారాలు విరివిగా అందుబాటులోకి రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే తిరుమలలో గణనీయమైన మార్పులు జరగడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలపై అదనపు ఈఓ సమీక్ష- ప్రత్యేక దర్శనాలు రద్దు - Brahmotsavam Arrangements Review

శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ - TTD announced Brahmotsavam dates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.