ETV Bharat / state

తగ్గిన మామిడి దిగుబడి - ఆమ్ చూర్​కు పెరిగిన డిమాండ్​ - నిజామాబాద్​ మార్కెట్​లో రికార్డు ధరలు - Amchur Crop Demand in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 2:15 PM IST

Updated : May 28, 2024, 4:35 PM IST

Amchur Crop Demand in Nizamabad : రాష్ట్రంలో పెద్ద మార్కెట్​లలో ఒకటి​గా ఉన్న నిజామాబాద్ యార్డుకు ఆమ్ చూర్ రాక మొదలైంది. గత వారం రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రైతులు దీన్ని మార్కెట్​కు తీసుకొస్తున్నారు. ఉత్తరాదిన చింతపండు బదులుగా ఆమ్‌ చూర్​ను వినియోగిస్తారు. మంచి డిమాండ్‌ ఉండటంతో మార్కెట్​లో రికార్డు ధర లభిస్తోంది. దాంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Amchur Rate Today in Telangana
Amchur Crop Demand in Telangana (ETV Bharat)

తగ్గిన మామిడి దిగుబడి ఆమ్ చూర్​కు పెరిగిన డిమాండ్​ నిజామాబాద్​ మార్కెట్​లో రికార్డు ధరలు (ETV Bharat)

Amchur Crop Demand in Nizamabad : ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్ చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రం నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు. మార్కెట్​లో ఆమ్‌ చూర్‌ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా మార్కెట్​కు దీన్ని రైతులు తీసుకొస్తున్నారు. ఏటా ఈ సీజన్​లో వివిధ జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. ఆమ్‌చూర్‌ చేసే సమయంలో అంటే మామిడి కోసి తంకర్లుగా మార్చే సమయంలో వర్షం పడితే దాని రంగు మారిపోతుంది. ఈ రకానికి మార్కెట్​లో తక్కువ ధర లభిస్తుంది. రంగు మారకుండా ఉన్న దానికి మాత్రం సగటు ధర రూ.18 వేల పైనే పలుకుతోంది. ఈ సీజన్​లో క్వింటా ఆమ్‌ చూర్‌ గరిష్ఠ ధర రూ.37,500 పలికింది. మంచి ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Amchur Colour Change Reasons : గతేడాది ఇంతే అత్యధిక ధర పలికింది. మామిడి సీజన్‌ ప్రారంభంలో దిగుబడిపై రైతులు నమ్మకంతో ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు మామిడి నేల రాలిపోయింది. దీంతో కాయలు కోసి ఆరబెట్టి ఆమ్ చూర్​ను మార్కెట్​కు తరలిస్తున్నారు. తద్వారా దీనికి రంగు మారే వాటిని కొనుగోలుదారులు తక్కువకు కొంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ పంటకు నిజామాబాద్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఇది ఎగుమతి అవుతుంది. నిజామాబాద్ మార్కెట్​లో దీనికి మంచి ధరలు లభిస్తుండటంతో ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికి తీసుకువస్తున్నారు.

"అకాల వర్షాల కారణంగా మామిడి కాయలు అన్నీ రాలిపోయాయి. దీంతో ఆమ్​ చూర్​ కాస్త రంగు మారింది. మా పంటకు ఇంకా ధర నిర్ణయించలేదు. రెండు మూడు రోజుల క్రితం క్వింటా రూ.20 వేల పైగా పలికింది. అలానే పెడితే పర్వాలేదు. అంతకంటే తక్కువ ధర పెడితే నష్టపోతాం. మేము సుమారు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టాం." - లక్ష్మి, సిద్దిపేట జిల్లా

అకాల వర్షాలకు నేలరాలిన మామిడి - 1500 ఎకరాల్లో పంట నష్టం - MANGO FARMERS LOSS IN NALGONDA

Amchur Rate Today in Telangana : నిజామాబాద్ మార్కెట్ యార్డులో 15 మంది ఆమ్ చూర్ వ్యాపారులున్నారు. దీన్ని అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్​నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రైతులు వస్తారు. రెండు మూడు రోజులైనా ఇక్కడే ఉండి పంట అమ్ముతారు. మే నెల మొత్తం విక్రయాలు సాగుతాయి. సుమారు రోజుకు 100 క్వింటాళ్ల వరకు తీసుకొస్తారు. డిమాండ్​కు అనుగుణంగా క్వింటాల్​కు రూ.8 వేల నుంచి రూ.24 వేల వరకు ధర పలుకుతుంది. సగటున రూ.15 వేలు అమ్ముడైనా, ఏటా రూ.22.50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ పంట విక్రయాల ద్వారా మార్కెట్ యార్డుకు దాదాపు రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఈ సారి మామిడి పూత, దిగుబడి ఎక్కువగా ఉన్నా అకాల వర్షాల కారణంగా కాయలు భారీగా రాలిపోయాయి. దీంతో ఆమ్ చూర్​కు బాగా డిమాండ్ పెరిగి మంచి ధరలు లభిస్తున్నాయి.

రాష్ట్రంలో జోరుగా మామిడి సీజన్ - క్రయ, విక్రయాలతో కళకళలాడుతోన్న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ - MANGO SALES IN HYDERABAD

Last Updated : May 28, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.