ETV Bharat / spiritual

దారిద్య్రాన్ని దూరం చేసే కాశీ మయూఖాదిత్యుడు! ఇలా చేస్తే ఏడు జన్మల వరకు అంతా శుభమే! - Khasi Mayukhaditya Temple

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 12:48 PM IST

Khasi Mayukhaditya Temple : కాశీ పట్టణంలో అడుగు పెట్టడమే మహాభాగ్యం. ఆధ్యాత్మిక వేత్తలకు చివరి మజిలీగా చెప్పే కాశీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అక్కడ అడుగడునా దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాశీకి వెళ్లిన వారు ద్వాదశ సూర్య ఆలయాలను తప్పకుండా దర్శించుకోవాలి. ఒక్కో ఆలయంలోని సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పూజలందుకుంటాడు.

Khasi Mayukhaditya Temple
Khasi Mayukhaditya Temple (Getty Images)

Khasi Mayukhaditya Temple : శ్రీనాథుడు రచించిన కాశీ ఖండములో కాశీ పట్టణం ప్రాశస్త్యం. కాశీలో దర్శించాల్సిన క్షేత్రాల వివరాలు, సూర్య దేవాలయాల దర్శనం వలన కలిగే ఫలితాలు వివరంగా ఉన్నాయి. కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో మయూఖాదిత్యుని ఆలయం కూడా ఒకటి. పవిత్ర గంగా నదీ తీరంలోని పంచగంగ రేవు సమీపంలో ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. ఇక్కడ సూర్యుడు మయూఖాదిత్యునిగా పూజలందుకుంటాడు.

ఆలయ స్థల పురాణం
పురాణాలు ప్రకారం పూర్వం సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని, మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి పూజించాడు. సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు. శివుడు సూర్యునికి ఈ వరం ఇవ్వడం వెనుక కూడా ఓ కథ ఉంది.

కాశీలోనే ఉండిపోయిన సూర్యుడు
తాను ప్రతిష్టించిన శివుని మంగళ గౌరి దేవిని పూజిస్తూ సూర్యుడు కాశీలోని ఉండిపోయాడు. ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యుడు ఒకే చోట ఉండిపోతే లోకాలన్నీ చీకటిలో ఉండిపోకుండా సూర్యుని మయూఖాలు అంటే కిరణాలు మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయి. అందుచేతనే శివుడు సూర్యునికి 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు.

దర్శన ఫలం
కాశీలోని మయూఖాదిత్యుని దర్శించిన వారికి జీవితంలో దారిద్య్ర బాధలుండవని సాక్షాత్తూ ఆ పరమ శివుడే వారం ఇచ్చాడు. అందుకే కాశీకి వెళ్లిన వారు తప్పకుండా మయూఖాదిత్యుని దర్శించి పూజించాలి.

పూజావిధానం
కాశీకి వెళ్లిన వారు విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి దర్శన అనంతరం సూర్య దేవాలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా దారిద్య్ర బాధలను పోగొట్టే మయూఖాదిత్యుని ఆలయానికి సూర్యోదయం సమయంలో చేరుకోవాలి. ముందుగా గంగా స్నానం శాస్త్రోక్తంగా ఆచరించాలి. అనంతరం పంచగంగ రేవులో ఉన్న మయూఖాదిత్యుని ఆలయానికి చేరుకొని స్వామి దర్శనం చేసుకొని, 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఆలయంలో సద్బ్రాహ్మణులకు గోధుమలు దానం ఇవ్వాలి. గోధుమలతో తయారు చేసిన పదార్ధాలను గోమాతకు తినిపించాలి. మయూఖాదిత్యుని ఎదురుగా కూర్చొని 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. చివరగా జన్మాంతర పాపకర్మల కారణంగా అనుభవిస్తున్న దారిద్య్ర బాధలను పోగొట్టమని మయూఖాదిత్యుని మనసారా వేడుకోవాలి.

ఈ విధంగా శాస్త్రోక్తంగా మయూఖాదిత్యుని దర్శనం, పూజలు చేసిన వారికి ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల వరకు దారిద్య్ర బాధలుండవని శాస్త్ర వచనం. అలాగే సూర్యుడు ప్రతిష్టించిన శివుని మంగళగౌరీ దేవిని ఆరాధించినవారికి సకల శుభాలు కలుగుతాయి.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఆ గుడిలో విష్ణుమూర్తికి ఎప్పుడూ ఉప్పు లేని నైవేద్యాలే- ఎందుకలా? - Lord Sri Vishnu Temple

విష్ణుమూర్తికే తప్పని శాపాలు- పతివ్రత కోపంతో రాయిగా మారిపోయాడంట! - Sri Vishnu And Vrinda Story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.