ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి దెబ్బ మీద దెబ్బ - 24 గంటలు గడవకముందే మరో ఇద్దరు - YSRCP MLCs Resign - YSRCP MLCS RESIGN

YSRCP MLCs Resign: కనీస గుర్తింపు, తగినంత గౌరవం, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేని వైఎస్సార్సీపీలో ఇమడలేమంటూ ఆ పార్టీని వీడే నాయకుల జాబితా పెరుగుతోంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ తమ పదవులకు రాజీనామా చేసి 24 గంటలు కాకముందే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీకి షాక్‌ ఇచ్చారు. కోర్టు అనుమతితో లండన్ వెళ్తున్న జగన్, పర్యటన ముగించుకుని తిరిగివచ్చేలోపు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలు వైఎస్సార్సీపీని వీడతారనే ప్రచారం జోరందుకుంది.

YSRCP MLCs Resign
YSRCP MLCs Resign (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 8:21 AM IST

YSRCP MLCs Resign: వైఎస్సార్సీపీకి సొంత పార్టీ నేతలే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అధినేత జగన్ తీరుతో వేగలేం అంటూ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు వారి పదవులతో సహా పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేశారు. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్లి కల్యాణ్‌ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. వారిద్దరూ శాసన మండలి ఛైర్మన్‌ కు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. కల్యాణ్ చక్రవర్తికి సుమారు మూడేళ్లు, పద్మశ్రీకి మరో ఐదేళ్ల వరకు పదవీకాలం ఉన్నప్పటికీ వారిద్దరూ రాజీనామా చేశారు. గౌరవం, విలువలేని చోట ఉండలేకే వైఎస్సార్సీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.

మొత్తం 58 మంది సభ్యులుండే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పటికే మూడు ఖాళీలు ఉన్నాయి. మిగిలిన 55మందిలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా 42 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీకి 9మంది, జనసేన కు ఒకరు, పీడీఎఫ్ నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఈ నెల 28న పోతుల సునీత, తాజాగా కల్యాణ్‌ చక్రవర్తి, పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైకాపా సభ్యుల సంఖ్య 39కి పడిపోయింది. ఒకటి, రెండు రోజుల్లో ఒక మహిళా ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజీనామా బాటలో మరికొందరు కూడా ఉన్నట్లు సమాచారం.

వైఎస్సార్సీపీ నుంచి మరో రెండు వికెట్లు ఔట్ - పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా! - YSRCP MLCs Resign

రాజీనామా చేసిన వారిలో బల్లి కల్యాణ్‌ చక్రవర్తి తండ్రి బల్లి దుర్గాప్రసాద్‌ మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశంలో ఉన్నారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. కొద్ది నెలలకే ఆయన మృతి చెందారు. దీంతో చక్రవర్తికి ఎంపీ టికెట్‌ ఇస్తారని అప్పట్లో అంతా అనుకున్నా ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. అయితే సొంత నియోజకవర్గం గూడూరులో, పార్టీలోనూ పెద్దగా గుర్తింపు లేకపోవటంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న చక్రవర్తి, ఇప్పుడు వైఎస్సార్సీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. ఆయన త్వరలో మళ్లీ తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ అయిన్పటికీ అక్కడ వైఎస్సార్సీపీలో పెత్తనమంతా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిదే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు ప్రొటోకాల్‌ పరంగా కూడా కనీస గౌరవం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీలో ఇమడలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పద్మశ్రీ కుటుంబానికి బీజేపీతో సంబంధాలున్నాయి. ఇప్పుడు ఆ పార్టీవైపు వెళ్తారా లేదా తెలుగుదేశంలో చేరతారా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్​రావు రాజీనామా - ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్ - YSRCP MPs Resign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.