ETV Bharat / politics

పంట నష్టంపై ప్రభుత్వం మొద్దు నిద్ర- ఈ ఆలస్యం ఎవరి మేలుకోసమో? - Drought Zones - DROUGHT ZONES

Drought Zones in AP : నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ చల్లని కబురుతో ఖరీఫ్​ పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ పంట కాలం కిందే లెక్క.. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రబీలో జరిగిన పంట నష్టం ఇప్పుడు గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలంటూ ఆదేశాలిచ్చింది.

drought_zones_in_ap
drought_zones_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 7:29 AM IST

Updated : May 20, 2024, 9:09 AM IST

Drought Zones in AP : దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలో వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేయడం ఎలా సాధ్యం? ఇదంతా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? లేక నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులంటే లెక్కలేనితనంతో వ్యవహరించింది. తీవ్ర కరవు ఏర్పడినా, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే పంటనష్టం గణన జాప్యమవుతుందని తెలిసీ పట్టించుకోలేదు. పోలింగ్‌ పూర్తయ్యేనాటికి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయని తెలిసినా పట్టించుకోలేదు. నిజానికి 2023 ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. 466 మండలాల్లో కరవు ఛాయలున్నా ప్రభుత్వం నాన్చుడు ధోరణితోనే వ్యవహరించింది. కరవు ఎక్కడా లేదంటూ బుకాయించి చివరకు 103 కరవు మండలాలతో సరిపెట్టింది. రబీలోనూ 661 మండలాల్లో డ్రైస్పెల్స్‌ ఉన్నా 87 మండలాలనే ప్రకటించింది. కనీసం రెండో విడత కరవు మండలాల ప్రకటన చేయకుండా సరిపెట్టేసింది.

అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల- వేలాది ఎకరాల్లో పంట నష్టం - Unseasonal Rains Damage Crops

కరవు ప్రకటనలో జగన్‌ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రబీ కరవు ప్రకటన ఫిబ్రవరి నాటికే చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. 2018-19 రబీలో అప్పటి ప్రభుత్వం కరవు మండలాలను ఫిబ్రవరిలోనే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికే ప్రకటన చేయడంతో పంటనష్టం గణనకూ కావాల్సినంత సమయం దొరికింది. కాగా, ఈ ఏడాది రబీలో కరవు ప్రకటన విషయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేసింది. 2023 అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య 661 మండలాల్లో పొడి వాతావరణం, 255 మండలాల్లో ఒక డ్రైస్పెల్‌ , 378 మండలాల్లో రెండు డ్రైస్పెల్స్, 28 మండలాల్లో మూడు డ్రైస్పెల్స్‌ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన మార్చి 16న హడావుడిగా 87 కరవు మండలాలను ప్రకటించింది.

కడప జిల్లాలో ఎండిపోతున్న శనగ పంట - ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటున్న రైతులు

రబీలో అనంతపురం, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో 87 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 33 శాతం పైగా దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టం కింద రాయాలి, 24వ తేదీ లోగా పూర్తి చేసిన జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్‌బీకేల్లో ఉంచాలి. ఇంత తక్కువ వ్యవధిలో పంటనష్టం లెక్కల పూర్తి ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు పంటలే లేనప్పుడు గ్రామాల్లోని వ్యవసాయ సహాయకులకు పొలాల్లో ఏం కన్పిస్తుంది? ఏం నమోదు చేస్తారు? అనే ప్రశ్నలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పేర్లు రాయడానికి తప్పితే.. నిజంగా నష్టపోయిన వారి పేర్లు నమోదు చేస్తారా? అనే సందేహాలూ వారిలో నెలకొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. పంటనష్టం అంచనాలు, అర్హుల జాబితాల్లో ఏ మాత్రం తేడాలొచ్చినా వివాదాలు మరింత ముదిరే ప్రమాదమూ ఉందన్న వాదన వినిపిస్తోంది.

మిగ్​జాం తుపానుతో వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు తెగుళ్లు- ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

పంట నష్టంపై ప్రభుత్వం మొద్దు నిద్ర- ఈ ఆలస్యం ఎవరి మేలుకోసమో? (ETV Bharat)

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రబీలో తీవ్ర కరవు నెలకొంది. అయినా , రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తగ్గించి చూపించింది. కేవలం 87 కరవు మండలాలనే ప్రకటించింది. రైతుల్ని అడిగితే ఎంతమేర దెబ్బతిన్నాయో చెబుతారు కానీ, ఈ ప్రభుత్వానికి అన్నదాతల బాగోగులు పట్టలేదు. రెండో విడత కరవు మండలాల ప్రకటననూ పక్కన పెట్టింది. ఖరీఫ్‌లోనూ ఇంతే నిర్లక్ష్యంగా 103 మండలాలతో సరిపెట్టినా . అప్పుడూ రెండో విడత కరవు మండలాల ప్రకటన చేయలేదు.

పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం

Last Updated : May 20, 2024, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.