TDP leaders condemned Jagan comments: హత్య, శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్రెడ్డికే చెల్లుతుందని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ఆరోపించారు. గురువారం బస్సు యాత్రలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అమరనాథ్ స్పందించారు. నిన్న జరిగిన బహిరంగ సభలో జగన్ రెడ్డి సత్యాలు మాట్లాడారని విమర్శించారు. వివేకా హత్య జరిగినపుడు అప్పటి సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అధికారులో ఉందని, హత్య ఘటనపై విచారణకు అడ్డంకులు సృష్టించింది ఎవ్వరో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
వివేకాను హత్యచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకుంది ఎవరో చెప్పాలని అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్య చేసింది ఎవ్వరో మా చిన్నాయనకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, అంటూ సీఎం జగన్ విడ్డూరంగా మాట్లాడారని అమరనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మరో మారు శవ రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎవ్వరు అడ్డుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. భహిరంగ సభలో భగవంతునికి తెలుసు, మా చిన్నాన్నకు తెలుసు అంటుంటే, వాస్తవాల కోసం జగన్ చిన్నాన్న వద్దకే వెళ్లి అడగాలా అంటూ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ గతంలో,బాబాయి హత్య, కొడి కత్తి నాటకాలు ఆడారని అమరనాథ్ రెడ్డి విమర్శించారు.
జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case
సీఎం జగన్ మానవత్వ విలువ లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని చంద్రబాబు వెంటబెట్టుకొని తిరుగుతున్నారా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ వైఎస్ వివేకా హత్యపై అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. వివేక హత్య కేసు దోషులను జగన్ రెడ్డి వెంటపెట్టుకొని తిరుగుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వివేకా హత్య చేసిన దోషులు జగన్ రెడ్డికి తెలుసని, అందు కోసమే సీబీఐలో వేసిన కేసును ఉపసంహరించుకున్నారని వరదరాజుల రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సీఎం జగన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి - YS Vivekananda Reddy murder
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఏప్రిల్ 12కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటర్నేషనల్ డాన్‌గా మారారు: గండి బాబ్జి - TDP Gandi Babji on drugs Case