ETV Bharat / politics

అప్పులు చేస్తూ వైఎస్సార్సీపీ అధికార దుర్వినియోగం - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ - TDP Atchannaidu Letter to EC - TDP ATCHANNAIDU LETTER TO EC

TDP Atchannaidu Letter to EC: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తుందని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

TDP_Atchannaidu_Letter_to_CEC
TDP_Atchannaidu_Letter_to_CEC (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 1:07 PM IST

Updated : Jun 3, 2024, 1:19 PM IST

అప్పులు చేస్తూ వైఎస్సార్సీపీ అధికార దుర్వినియోగం - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ (ETV Bharat)

TDP Atchannaidu Letter to EC: తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటి వేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారని ఆరోపించారు.

చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్బీఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల అప్పులకు దరఖాస్తు చేసిందని మండిపడ్డారు. ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సీఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న 4వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారన్నారని తెలిపారు.

సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి - Bhumireddy on Sajjala Perni Nani

మంగళవారం ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలని కోరారు. ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ - పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు - SC On Postal Ballot Votes

Last Updated : Jun 3, 2024, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.