ETV Bharat / politics

పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ముంబయి సినీ నటిపై కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు - Mumbai Actress Harassment Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 7:21 AM IST

Mumbai Actress Harassment Case: బాలీవుడ్‌ నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన నాటి బెజవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నాలుగు రోజుల్లో స్రవంతి రాయ్‌ నివేదిక ఇవ్వనున్నారు.

Mumbai Actress Harassment Case
Mumbai Actress Harassment Case (ETV Bharat)

Mumbai Actress Harassment Case: ముంబయి సినీ నటి అరెస్ట్ వ్యవహారంలో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ముంబయి నటి, ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సీడీ ఫైళ్లను సీపీ తెప్పించి పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులున్నట్లు గుర్తించారు. వీటిపై నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు.

కుక్కల విద్యాసాగర్‌ పంపిన అసభ్యకర చిత్రాలు, వీడియో కాల్స్‌: పోలీసు అధికారులపై నటి చేసిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా అధికారితో విచారణ చేయించాలని డీజీపీ ఆదేశించడంతో స్రవంతిరాయ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ముంబయి నటి ఇవాళ హైదరాబాద్‌ నుంచి విజయవాడ రానున్నారు. సీపీ రాజశేఖర్‌బాబును ఆయన కార్యాలయంలో కలవనున్నారు. విజయవాడ పోలీసులు తనను ఇబ్బంది పెట్టిన తీరును సీపీకి వివరించనున్నారు. అనంతరరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌ను కలిసి తన వద్ద ఉన్న వివిధ పత్రాలు, ఆధారాలను అందించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తనకు పంపిన అసభ్యకర చిత్రాలు, వీడియో కాల్స్‌ గురించి సమాచారాన్ని ముంబయి నటి ఇవ్వనున్నారు.

హీరోయిన్‌ వేధింపుల కేసులో విచారణకు ఆదేశం- ముంబయికి పోలీసు బృందాలు - చిక్కుల్లో IPSలు - Mumbai Actress Case Updates

అరెస్టు చేయడంపై అనుమానాలు: ముంబయి నటిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. జగ్గయ్యపేటలోని తన 5 ఎకరాల భూమి సొంతం చేసుకునేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి, మరుసటి రోజు ముంబై వెళ్లి నిందితులను అరెస్టు చేయడంపై అనుమానాలున్నాయని ముంబయి నటి తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.

సినీ నటిపై పోలీసుల తీరును మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులే ఓ మహిళపై అక్రమ కేసులు బనాయించటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అంటున్నారు. సినీ నటిని ఇబ్బందిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గూండాల తరహాలో కిడ్నాప్‌ చేశారు - ఏపీ పోలీసులు వేధించారు: ముంబై నటి - Mumbai Actress Harassment Issue

42 రోజుల పాటు రిమాండ్‌లో: విజయవాడలోని జిల్లా కారాగారంలో ముంబయి నటితోపాటు ఆమె తల్లిదండ్రులు 42 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకు కూడా వచ్చి ముంబైలో కేసు వాపసు కోసం ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కారాగారంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి పోలీసులపైనే తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా విచారణను లోతుగా చేస్తామని విజయవాడ సీపీ రాజశేఖర బాబు తెలిపారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.